October month Birth : జీవితంలో కొన్ని విజయాలు అందుకోవాలంటే అదృష్టం ఉండాలని అంటారు. ఒక వ్యక్తి ఎంత కష్టపడినా.. ఎన్ని మంచి పనులు చేసినా అతని లైఫ్ లో తృప్తి అనేది ఉండదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది అతని జాతకలోపమే అని, వారు పుట్టిన తేదీలో ఉన్న సమస్యలే అని జ్యోతిష్యులు అంటుంటారు. అయితే పుట్టిన తేదీ ప్రకారం జాతకం చూసిన తరువాత ఏవైనా దోషాలు ఉంటే వాటికి పరిహారం చేయడం వల్ల అనుకున్న విధంగా జీవితాన్ని మలుచుకోవచ్చని చెబుతుంటారు. మరోవైపు కొన్ని పుట్టిన తేదీలు ఆటోమేటిక్ గా అదృష్టంగా ఉంటాయి. ఈ తేదీల్లో జన్మించిన వారు ఎటువంటి పని మొదలు పెట్టినా సక్సెస్ అవుతుంది. అంతేకాకుండా వీరికి పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. న్యూమరాలజీ ప్రకారం 1 నుంచి 9 వరకుఉన్న అంకెల్లో కొన్ని అదృష్టం కలగినవి ఉంటాయి. అయితే ఈ తేదీలు ఏవి ఎటువంటి ప్రయోజనాలు కలిగిస్తాయో న్యూమరాలజీ చెబుతుంది. ముఖ్యంగా ఈ నెలలో ఏ తేదీల్లో పుట్టిన వారికి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో న్యూమరాలజీ ప్రకారం తెలుసుకోవచ్చు. మరి ఈ నెంబర్లలో మీ పుట్టిన రోజు ఉందా? ఉంటే ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకోండి..
న్యూమరాలజీ ప్రకారం 1 నుంచి 9 అంకెల వరకు ఒక్కోటి ఒక్కో ఫలితాన్ని కలిగి ఉంటాయి. ఈ అంకెలను పుట్టిన తేదీతో జోడించాలి. ఫలితంగా వచ్చే సంఖ్యను అదృష్ట సంఖ్య అంటారు. అదృష్ట సంఖ్య 1 నుంచి 9 అంకెల్లో ఏదో గుర్తించాలి. ఆ సంఖ్య ఎటువంటి ఫలితాలను కలిగి ఉంటుందో ఆదే విధంగా జీవితంలో కొన్ని మార్పులు ఉంటాయని న్యూమరాలజీ చెబుతుంది. ఉదాహరణకు పుట్టిన తేదీ 4 ఉందనుకుందాం. న్యూమరాలజీ ప్రకారం ఈ అంకె ఎటువంటి అదృష్టాన్ని కలిగి ఉంటుందో అదే జరుగుతుంది. అయితే రెండు డిజిట్ ఉన్నప్పుడు..అంటే పుట్టిన తేదీ 11 ఉంటే 1+1 =2 , అంటే 2 ప్రకారం అదృష్ట సంఖ్యను తెలుసుకుంటారు.
అక్టోబర్ లో దసరా, దీపావలి పండుగలు ఉన్నాయి. ఈ నెలలో కొన్ని రాశుల వారు అదృష్టాన్ని కలిగి ఉన్నారు. అయితే న్యూమరాలజీ ప్రకారం వారి జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఈనెలలో 1 వ అంకెను కలిగి ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి. వీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుది. నెంబర్ 2 అంకె కలిగిన వారి వ్యాపారం జోరుగా ఉంటుంది.వీరికి పండుగల సీజన్ కలిసి వస్తుంది. ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. దేశ విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది.
న్యూమరాలజీ ప్రకారం 3 అంకె వచ్చిన వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కొందరు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. మెరుగైన సంబంధాలు పెురుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. 4 అంకెను కలిగిన వారు అధికారులకు కలిసి వస్తుంది. వీరు కొన్ని బాధ్యతలు పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. నెంబర్ 5 కలిగిన వారు పెద్దల సహకారంతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. స్నేహితుల ద్వారా మోసపోయే అవకాశం ఉంటుంది.
నెంబర్ 6 కలిగిన వ్యాపారులకు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కెరీర్ గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులు ఉల్లాసంగా ఉంటారు. నెంబర్ 7 కలిగిన వారు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఇంట్లో ఉన్న సమస్యలను పరిష్కరించగలుగుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. నెంబర్ 8 కలిగిన వారు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు కొత్త ఆదాయాన్ని అందుకుంటారు. నెంబర్ 9 కలిగిన వారు అనుకూల ఫలితాలను పొందుతారు. ఖర్చులను అదుపు చేస్తారు. పిల్లల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More