Homeలైఫ్ స్టైల్Husband And Wife Relationship: మీకు పెళ్లయిందా.. ఈ పనులు చేస్తున్నారా.. అయితే విడాకులు ఖాయం!

Husband And Wife Relationship: మీకు పెళ్లయిందా.. ఈ పనులు చేస్తున్నారా.. అయితే విడాకులు ఖాయం!

Husband And Wife Relationship: చాలామంది భార్యాభర్తలు వారికి నచ్చినట్లు మాట్లాడుతూ, నచ్చిన పనులు చేస్తూ ఉంటారు. అయితే ఇది భాగస్వామికి ఎంత బాధ కలిగిస్తుందో వాళ్లు అర్థం చేసుకోరు. అది చివరికి విడాకుల వరకు దారితీస్తుంది. ఇటీవల పెళ్లికి ఎంత ఉత్సాహం చూపుతున్నారో.. అంతే త్వరగా విడాకులూ అవుతున్నాయి. వైవాహిక బంధాలను తెంచుకుంటున్నారు. ఈ పనులకు దూరంగా ఉంటే.. మీ సంసారం హాయిగా సాగిపోతుంది. మనస్పర్ధలు, తగాదాలు ఉన్నప్పటికీ ప్రేమ చెక్కుచెదరకుండా ఉంటే బంధం కలకాలం నిలిచి ఉంటుంది.

చిన్న చిన్న కారణాలే..
చిన్న చిన్న గొడవలు కూడా ఒక్కొక్కసారి విడాకుల వరకు దారితీస్తాయి. చాలా సంబంధాలు విచ్ఛిన్నం కావడానికి కారణాలు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ ఆవేశం వాళ్లని విడాకుల వరకు తీసుకు వెళుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన ఇలాంటి గొడవలు రాకుండా చూసుకోండి. ఇద్దరి మధ్య గొడవ రావడానికి ప్రధాన సమస్య డబ్బు. ఒకరు ఎక్కువ సంపాదించినప్పుడు రెండవ వాళ్లను తక్కువగా చూడటం.

ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌..
భాగస్వామి ఏమీ అనకపోయినా తక్కువ సంపాదిస్తున్నాను అనే ఇన్ఫియారిటీ కాంప్లెక్స్‌ ఇద్దరి మధ్యలో సంబంధాన్ని దూరం చేస్తుంది. కాబట్టి ఇద్దరు కూర్చుని ఆర్థిక విషయాల మీద ఒక అభిప్రాయానికి రావడం మంచిది. ఇద్దరి అనుబంధం ముందు డబ్బు చాలా చిన్న విషయం అని గుర్తుంచుకుంటే మంచిది.

కమ్యూనికేషన్‌ గ్యాప్‌..
అలాగే భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్‌ చాలా అవసరం. ఒకరితో ఒకరు తమ మనసులోని మాటను చెప్పుకోలేకపోవటం వలన చిన్న విషయం కూడా అపార్ధాలకి దారి తీసి అది విడాకుల వరకు వెళుతుంది. కాబట్టి ఒకరి అభిప్రాయాన్ని మరొకరు పంచుకోగలిగినంత స్వేచ్ఛ, స్వాతంత్రాలను దంపతులిద్దరూ కలిగి ఉండాలి.

ఎక్కువ అంచనాలు..
అలాగే భాగస్వామిపై ఎక్కువగా ఎక్సె్పక్టేషన్స్‌ పెట్టుకోకండి. మీరు ఎక్స్పర్ట్‌ చేసినట్టు అవతలి వ్యక్తి లేకపోతే అది కూడా మళ్లీ సమస్యలకి దారితీస్తుంది.

ఆత్మగౌరవం..
అలాగే భార్యాభర్తలిద్దరికీ ఆత్మగౌరవం చాలా అవసరం. పదిమంది ముందు భర్త ఒక మాట అంటే అత్తమామలు, ఆడపడుచులు కూడా అదే మాట అనటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి భార్యని పదిమందిలో ఏమీ అనకండి.

వివాహేతర బంధం..
అలాగే భాగస్వామిని ఇంటిలో పెట్టుకొని మరొక వ్యక్తితో బయట ఇల్లీగల్‌ కాంటాక్ట్స్‌ పెట్టుకోకండి. దీనివలన కూడా విడాకులకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. చాలా విడాకుల కేసులలో ఇల్లీగల్‌ కాంటాక్ట్స్‌ కూడా ప్రధాన కారణం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular