Snake control tips: వర్షాకాలం రాగానే పాములు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గ్రామాల్లోని పొలాల్లో ఇవి రైతులకు ఎదురవుతూ ఉంటాయి. అయితే పాములు కనిపించడం సాధారణమే అయినా ఒక్కోసారి అవి మనకు తెలియకుండా కుట్టడం వల్ల ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా అడవిలో ఉండే పాములు ఒక్కోసారి ఇంటి పరిసరాల్లోకి వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఇంట్లోకి కూడా చొరబడే ప్రమాదం ఉంది. పాముల వల్ల మనుషులకు ప్రమాదమే అయినా.. అవి కొన్ని వాసనలకు, జంతువులకు దూరంగా ఉంటాయి. ఇంట్లోనే లభించే కొన్ని రకాల వస్తువులతో వీటిని తయారు చేయడం వల్ల పాములను ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడవచ్చు. అవేంటంటే?
పాములకు కొన్ని ఘాటు వాసనలు అస్సలు పడవు. ముఖ్యంగా వేపాకు నీళ్లలో కలిపిన ద్రవాన్ని పాములు ఎక్కువగా వచ్చే ప్రదేశంలో చల్లడం ద్వారా అవి ఈ వాసన పడకుండా అటువైపు రాకుండా ఉంటాయి. ఈ మిశ్రమాన్ని ఇంటి పరిసరాల్లో ఉన్న చెట్లల్లో.. లేదా ఇంటి కిటికీలకు రాయడం వల్ల అవి రాకుండా ఉంటాయి. అపరిశుభ్రమైన ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ ఉంటారు. ఈ బ్లీచింగ్ పౌడర్ ను ఇంటి పరిసరాల్లో ఎప్పటికీ చల్లుతూ ఉండటం వల్ల ఆ ప్రదేశం స్వచ్ఛంగా ఉండటమే కాకుండా పాములు రాకుండా కూడా అడ్డుకోవచ్చు. అలాగే దాల్చిన చెక్క పొడి, వెనిగర్, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ఇంట్లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో స్ప్రే చేయడం వల్ల పాములు అటువైపు రాకుండా ఉంటాయి. ఉల్లిపాయల్లో ఉండే సెల్ఫోనిక్ ఆమ్లం పాములకు అస్సలు నచ్చదు. వీటిని పెరట్లో గాని.. ఇవి పెరిగే చెట్లను గాని పెంచడం వల్ల పాములు ఆ ప్రదేశానికి రాకుండా భయపడతాయి. అలాగే లవంగం, దాల్చిన చెక్క కలిపిన మిశ్రమంలో కొంత నీరు పోసి స్ప్రే చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
అమ్మోనియా లభించే మొక్కలను ఇంటి పరిసరాల్లో పెంచుకోవడం వల్ల కూడా పాములు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే కాక్టస్ అనే ముళ్ళు ఉండే మొక్క అంటే పాములకు ఎంతో భయం. ఇవే కాకుండా బంతి, తులసి, నిమ్మ గడ్డి, దానిమ్మ వంటి మొక్కలను పెంచుకోవడం వల్ల పాములు అటువైపు రాకుండా ఉంటాయి. పాములకు కొన్ని రకాల జంతువులు అంటే ఎంతో భయం. ప్రధానంగా ముంగిసను చూస్తే పాము పారిపోతుంది. అలాగే కుక్కలు, పిల్లులు కూడా పాములకు శత్రువులు గానే ఉంటాయి. అలాగే గుడ్లగూబ వంటి కొన్ని పక్షులు కూడా పాములతో పోరాడుతాయి.
సాధారణంగా పాములు మనుషుల అడుగుల శబ్దాలకు దూరంగా వెళ్తాయి. వాస్తవానికి వీటికి చెవులు అస్సలు ఉండవు. అయినా కూడా నేలపై కలిగే అలికిడి వలన ఇవి గుర్తించి మనుషుల కు దూరంగా వెళ్తాయి. అయితే ఆకారణంగా ఏ పాము మనుషులపై దాడి చేయడానికి ప్రయత్నించదు. అందువల్ల మనుషులే ముందు జాగ్రత్త కొద్దీ వాటికి దూరంగా వెళ్లాలి. అలా కాకుండా పాములను వేటాడాలని చూస్తే తిరిగి దాడి చేయగలవు.