Lord Shiva: సోమవారం రాగానే కొందరు అప్రమత్తం అవుతారు. ఎందుకంటే వీకెండ్ డేస్ తరువాత మళ్లీ కార్యాయలాలు, వ్యాపార నిమిత్తం ఉదయమే రెడీ కావాల్సి ఉంటుంది. విద్యార్థులు సెలవు తరువాత మళ్లీ స్కూలుకు వెళ్లాల్సి వస్తుంది. అయితే ఈరోజు ప్రశాంతంగా గడవాలంటే.. ఎలాంటి బాధలు ఉండకుండా ఉండాలంటే శివాలయాలను సందర్శించాలని కొందరు ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ప్రతి సోమవారం శివుడిని సందర్శించడం వల్ల ఆ స్వామి అనుగ్రహం ఉండడంతో పాటు అనుకున్న పనులు చేయగలుగుతారని అంటున్నారు. అయితే కేవలం ఆలయానికి వెళ్లడమే కాకుండా మహా శివుడికి సంబంధించిన ఈ మంత్రాన్ని జపించడం వల్ల అన్నీ శుభాలు కలుగుతాయని అంటున్నారు. ఇంతకీ ఆ మంత్రం ఏమిటంటే?
సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టం. ఈ రోజు ఎక్కడ శివాలయం ఉన్నా.. అక్కడ భక్తుల రద్దీ ఉంటుంది. ప్రధాన శివాలయాల్లో అయితే క్యూ లైన్లో బారులు తీరుతూ ఉంటారు. అయితే శివాలయం సందర్శించినప్పుడు స్వామి దర్శనం కంటే ముందుగా వినాయకుడిని దర్శించుకోవాలి. ఆ తరువాత నందీశ్వరుడికి నమస్కరించాలి. ఈ సమయంలో ‘నాకు శివ దర్శనం కావడానికి ఎలాంటి ఆటంకం లేకుండా చూడు స్వామి.. ’ అని నందీశ్వరుడిని కోరుకోవాలి. సాధారణంగా నందీశ్వరుడి దర్శనం తరువాత వెంటనే శివ దర్శనం ఉంటుంది. కానీ ఆ తరువాత ఎప్పటికీ శివ దర్శనం ఆటంకం లేకుండా చూడాలి.. అని కోరుకోవాలి. అలా ప్రార్థించడం వల్ల మరోసారి ఆలయానికి వచ్చినప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా శివ దర్శనం ప్రశాంతంగా సాగుతుంది అని పండితులు చెబుతున్నారు.
మహాశివుడిని దర్శించుకున్న తరువాత తమ జీవితం బాగుండాలని కోరుకుంటారు. అయితే ఈ సమయంలో ఈ మంత్రాన్ని 9 సార్లు పఠించడం వల్ల జీవితంలో అనుకున్న పనులు పూర్తవుతాయని అంటున్నారు. అదే ‘ఓం నమ:శివాయ’ అని 9 సార్లు జపించాలి. ఈ మంత్రాన్ని మనస్పూర్తిగా అనడం వల్ల ఆ శివుడి అనుగ్రహం ఉంటుందని అంటున్నారు. కేవలం ఆలయానికి వెళ్లినప్పుడే కాకుండా సోమవారం మొత్తం శివనామస్మరణ చేయడం వల్ల శివానుగ్రహం ఉంటుందని చెబుతున్నారు.
త్రిమూర్తుల్లో లయ కారకుడు అయిన శివుడి అనుగ్రహం లభిస్తే ఎటువంటి ప్రమాదాల నుంచి అయినా తప్పించుకోవచ్చని అంటున్నారు. అలాగే జీవితంలో ఆర్ఠికంగా స్థిరపడవచ్చని చెబుతున్నారు. శివానుగ్రహం పొందాలంటే ఎన్నో తపస్సులు చేయాల్సిందే. కానీ మనస్పూర్తిగా ప్రతిసోమవారం ఇలా చేయడం వల్ల స్వామి అనుగ్రహం పొందే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే ఈ రోజంతా శివనామస్మరణం చేయడం వల్ల స్వామి అనుగ్రహం పొందవచ్చని చెబుతున్నారు. అయితే శివాలయం సందర్శించిన సమయంలో శివుడికి ఇష్టమైన అభిషేకం చేస్తూ.. బిల్వ పత్రాలను సమర్పించాలని అంటున్నారు.
మహా శివుడు ఎవరు కోరినా వెంటనే వరాలు ఇస్తాడు. అలాగే భక్తితో చిన్న అభిషేకం చేసినా సంతోషిస్తాడు. అందువల్ల ప్రతి సోమవారం శివాలయం సందర్శించే ప్రయత్నం చేయాలని పండితులు చెబుతున్నారు. అలాగే నిత్యం ఓం నమ: శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో అన్నీ సంతోషాలే ఉంటాయని పేర్కొంటున్నారు.