
Vandebharat Train : దేశంలో వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. వేగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వందే భారత్ రైళ్లు పలు మార్గాల్లో పరుగులు పెడుతున్నాయి. దీంతో తక్కువ సమయంలోనే గమ్య స్థానాలకు చేర్చే వందేభారత్ రైళ్ల వేగంతో ప్రజలు సుదూర ప్రాంతాలను కూడా తక్కువ సమయంలో చేరుకుంటున్నారు. ఈ రైళ్లతో మంచి ఫలితాలు వస్తుండటంతో రైల్వే శాఖ పలు మార్గాలను ఎంచుకుని మరీ రైళ్లు ప్రవేశపెడుతోంది. గతంలోనే సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య వందే భారత్ రైలు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం మళ్లీ సికింద్రాబాద్ – తిరుపతి మధ్య మరోమారు వందే భారత్ రైలును నడిపిస్తోంది. దీనికి గాను ఏప్రిల్ 9న ముహూర్తం నిర్ణయించుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులు తిరుపతి పుణ్యక్షేత్రానికి వేగంగా చేరుకునేందుకు వందే భారత్ రైలు నడుపుతోంది. ఈ మేరకు ఏప్రిల్ 9న తిరుపతి నుంచి 10న సికింద్రాబాద్ నుంచి వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. మంగళవారం మినహా వారంలో ప్రతిరోజు పరుగులు పెడుతుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణ సమయం 8.30 గంటలు. దీంతో ఇన్నాళ్లు మనం తిరుపతికి చేరాలంటే చాలా సమయం పట్టేది. ప్రస్తుతం త్వరగా చేరుకునే ఏర్పాట్లో భాగంగా వందే భారత్ రైలు రావడంతో సమయం ఆదా కానుంది.

ఏప్రిల్ 8నే రైలు ప్రారంభం అవుతున్నా ఆ రోజు ప్రయాణికులను అనుమతించడం లేదు. సికింద్రాబాద్ లో 11.30 గంటలకు ప్రారంభమై తిరుపతికి 21.00 గంటలకు చేరుతుంది. గురువారం నుంచి అధికారిక ప్రయాణం కొనసాగిస్తుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి బయలు దేరే సమయాల్లో ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్, 7.19 గంటలకు నల్గొండ, 9.45 గంటలకు గుంటూరు, 11.09 గంటలకు ప్రకాశం, 12.29 గంటలకు నెల్లూరు, 14.30 గంలకు తిరుపతి చేరుకుంటుంది.
తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే సమయాల్లో తిరుపతిలో మధ్యాహ్నం 15.15 గంటలకు బయలుదేరి 17.20 గంటలకు నెల్లూరు, 18.30 గంటలకు ప్రకాశం, 19.45 గంటలకు గుంటూరు, 22.10 గంటలకు నల్గొండ, సికింద్రాబాద్ కు 23.45 గంటలకు చేరుకుంటుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల సౌకర్యార్థం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దర్శనార్థం వందే భారత్ రైలును ప్రవేశపెడుతున్నారు. తెలుగువారికి ఇక వడ్డీకాసుల వాడిని దర్శించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. సులభంగా వెళ్లి దర్శనం చేసుకుని రావచ్చు.