Lakshmi Pooja 2022: హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. ఈ రోజు కొత్త బట్టలు కట్టుకుని లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసి సంపదలు కలగాలని కోరుకుంటారు. దీపావళి రోజును ఎక్కువగా లక్ష్మీదేవిని పూజించడానికే ప్రాధాన్యం ఇస్తారు. ప్రతి ఇంటిని అందంగా అలంకరించి దీపాలు వెలిగిస్తారు. ఆ కాంతిలో ఎంతో ఆనందం పొందుతారు. దీపాల పండుగ దీపావళి కావడంతో ఇళ్లన్నీ వెలుగుల మయంగా విరాజిల్లుతాయి. సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని లక్ష్మీదేవిని ప్రార్థించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఒక్కరూ దీపావళి సందర్భంగా సంతోషంగా తమ ఇళ్లను అలంకరించుకుని దీపాలు వెలిగిస్తుంటారు.

దీపావళి పండుగ ఈ సారి మాత్రం సందిగ్ధ పరిస్థితులను తెచ్చింది. 25న అమావాస్య, సూర్యగ్రహణం ఉండటంతో నరక చతుర్దశి 24నే జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. దీపావళి రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు పూజలు నిర్వహించేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. దీంతో పూజా సమయాలు కూడా వెల్లడిస్తున్నారు. సమయంలో పూజలు చేయాలి? ఏ సమయానికి ముగించాలి అనే విషయాలపై స్పష్టత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ విశిష్టత దృష్ట్యా పండితులు చెప్పిన విధంగా పూజలు చేసుకోవాలని సూచిస్తున్నారు.
అక్టోబర్ 24న లక్ష్మీపూజను సాయంత్రం 5.39 గంటల నుంచి 6.51 గంటల వరకు నిర్వహించుకోవాలని చెబుతున్నారు. దీపావళి పండుగ రోజున ఇదే ముహూర్తంలో పూజలు చేసుకుని లక్ష్మీదేవిని కొలుచుకోవాలని సూచిస్తున్నారు. దీపావళి పండుగను అందరు ప్రసన్నంగా జరుపుకోవాలని ఆశిస్తున్నారు. దీపావళి సోమవారం రావడంతో సరైన సమయంలో పూజలు చేసుకుని లక్ష్మీదేవిని కొలుచుకోవడం ఉత్తమం. తెల్లవారితే సూర్య గ్రహణం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని మార్గనిర్దేశం చేస్తున్నారు.

గ్రహణం మొదలైన నుంచి పూర్తయ్యే వరకు ఏం తినకుండా ఏం తాగకుండా ఉండాలి. ఏదైనా తినాలనుకుంటే గ్రహణం మొదలు కాకముందే తీసుకుంటే మంచిది. స్వాతి నక్షత్రం తుల రాశి వారు జాగ్రత్తలు వహించాలి. గ్రహణం వల్ల కలిగే దోషాలు నివారించుకోవడానికి మరుసటి రోజు శివాలయ దర్శనం చేసి అభిషేకం చేయించుకోవాలి. తుల, కర్కాటక, మీన, వృశ్చిక రాశుల వారు కూడా సూర్య గ్రహణం తరువాత దేవాలయాన్ని దర్శించుకుని శివుడిని దర్శించుకుంటేనే ప్రయోజనం కలుగుతుంది.