Lord Shiva: మన దేవతా మూర్తుల ఆకారాలు విచిత్రంగా ఉంటాయి. ఒకరు నాలుగు తలలతో ఉంటే మరొకరు శేష తల్పంపై శయనిస్తూ కనిపిస్తారు. మరొకరు మెడలో పామును వేసుకుని భక్తులను మెప్పిస్తారు. పౌరాణిక గాథల్లో కూడా వీరి రూపంపై పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ మనం ఎక్కువగా పూజించే దేవుళ్లలో శివుడే అందరికి ఇష్టం. శివుని కొలువని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. అలాంటి శివరూపంపై ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.

మన సినిమాల్లో మాత్రం నిజమైన పాములను మెడలో వేసుకుని నటించడం తక్కువే. కదిలే పాము మెడలో వేసుకుంటే నటించడానికి ఇబ్బంది ఉంటుందని భావించి ఇత్తడి పామును మెడలో వేసుకుని నటించడం చేస్తున్నారు. మంజునాథలో చిరంజీవి, గతంలో ఎన్టీఆర్, శివాజీ గణేషన్ కూడా ఇత్తడి పాములనే మెడలో వేసుకుని నటించడం చూశాం.
Also Read: దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్.. కేసీఆర్‌కు పెద్ద ఆయుధం దొరికిందిగా..!
ఏదిఏమైనా శివుడి మెడలో పామే ఆకర్షణగా ఉంటుంది. అది లేకపోతే శివుడి పాత్ర అందంగా ఉండదు. ఎన్ని ఆభరణాలు వేసినా చివరకు పాము ఉంటేనే శివుడి పాత్రకు పరమార్థం ఉంటుందనేది సత్యం. దీంతోనే పాముకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారు. పురాణాల ప్రకారం శివుడికి అందమైన విధంగా పాము ప్రముఖ పాత్ర పోషిస్తోంది.

అయితే సినిమాల్లో మాత్రం కథానాయకులకు శివుడి పాత్రలు దక్కడం అరుదుగానే జరుగుతుంది. అలాంటి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఒప్పుకుని అందులో లీనమైపోతారు. శివరూపాన్ని చక్కగా అభినయిస్తూ ఉంటారు. కానీ నిజమైన పామును మెడలో వేసుకోవడానికి ఇష్టపడుతున్నా అది తిన్నగా ఉండదనే ఉద్దేశంతోనే ఇత్తడి పాములకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఏమైనా శివుడి ప్రధానంగా సాగే సినిమాల ప్రభావం తక్కువగానే ఉన్నా వాటిని ఎంచుకోవడానికి కథానాయకులు ఇష్టపడుతుంటారు. శివుడి రూపంలో తమను చూసుకుని మురిసిపోతుంటారు. దీని కోసం ఎంతో సంబరపడతారు. ఇక సినిమాల్లో తమదైన నటనతో రాణిస్తారు. ప్రేక్షకులను అలరిస్తారు.
Also Read: ఆర్ఆర్ఆర్ నుంచి అభిమానులకు మరో సర్ ప్రైజ్.. రాంచరణ్, ఎన్టీఆర్ ఇలా.. వైరల్ ఫొటో