https://oktelugu.com/

Mobile Radiation : మీరు వాడుతున్న మొబైల్ సేఫేనా.. రేడియేషన్‌ గురించి ఇలా తెలుసుకోవచ్చు!

అర్థమైంది కదా.. ఇంకేముంది.. వెంటనే మీ మొబైల్‌లో రేడియేషన్‌ ఎంత ఉంది.. మీరు వాడుతున్న ఫోన్‌ సేఫా.. కాదా అన్న విషయాలు తెలుసుకోండి.

Written By: NARESH, Updated On : January 2, 2024 7:29 pm
Follow us on

Mobile Radiation :  మొబైల్‌ ఇప్పుడు నిత్యావసర వస్తువు అయిపోయింది. టెక్నాలజీ పెరుగుతుండడంతో ఫోన్‌ లేకుండా ఉండలేని పరిస్థితి. కొంత మంది ఫోన్‌ వాడకపోతే వ్యాపార వాణిజ్యాలు నిలిచిపోతాయి. ఇక కొంతమంది విపరీతంగా ఫోన్‌ వాడుతుంటారు. అయితే అతిగా ఫోన్‌ వాడకం వలనై బ్రెయిన్‌ క్యాన్సర్‌ లేదా బ్రెయిన్‌ ట్యూమర్‌ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే కొన్ని ఫోన్లు అధిక రేడియేషన్‌ విడుదల చేస్తుంటాయి. ఇలాంటివి వాడినప్పుడు బ్రెయిన్‌పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇక క్యాన్సర్‌కు, ట్యూమర్లకు ప్రధాన కారణం రేడియేషనే. కాబట్టి మన ఫోన్‌ విడుదల చేసే రేడియేషన్‌ ఎంత ఉందో తెలుసుకోవాలి. ఎక్కువ రేడియేషన్‌ ఉంటే.. ఫోన్‌ మార్చడం ఉత్తమం. మరి రేడియేషన్‌ ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం.

ఫోన్‌లోనే రేడియేషన్‌ సమాచారం..
మన ఉపయోగించే ఫోన్‌లోనే రేడియేషన్‌ సమాచారం తెలుసుకోవచ్చు. ఇందుకు మనం చేయిల్సింది చిన్న పని *#07# ఈ నంబర్‌ ప్రెస్‌ చేసి కాల్‌ చేయగానే మనకు ఫోన్‌ చేడియేషన్‌కు సంబంధించిన మెసేజ్‌ డిస్‌ప్లే అవుతుంది. అందులో రేడియేషన్‌ వివరాలు ఉంటాయి. రెండు సమాచారాలు మనకు కనిపిస్తాయి. అందులో ఒకటి (హెద ఎస్‌ఏఆర్‌) హెడ్‌ స్పెసిఫిక్‌ అబ్జర్వేషన్‌ రేట్‌. ఇది మనం ఫోన్‌ మాట్లాడుతున్నప్పుడు ఉండే రేడియేషన్‌. రెండోది (బాడీ ఎస్‌ఏఆర్‌)బాడీ స్పెసిఫిక్‌ అబ్జర్వేషన్‌ రేట్‌. అంటే మనం ఫోన్‌ వాడుతున్నప్పుడు అంటే ఫోన్‌లో వీడియోలు చేస్తున్నప్పుడు, మెయిల్‌ చేస్తున్నప్పుడు, మెసేజ్‌లు చేస్తున్నప్పుడు మన శరీరం అబ్జర్వ్‌ చేసుకునే రేడియేషన్‌ రేట్‌.

ఎంత ఉండాలి..
ఈ రేడియేషన్‌ అబ్జర్వేషన్‌ రేట్‌ రెండింటిది 1.6 w/kg(వాట్‌ పర్‌ కేజీ) ఉండాలి. రెండింటిలో ఏది 1.6 w/kg కన్నా ఎక్కువ ఉన్నా.. ఆ ఫోన్‌ ప్రమాదకరమని గుర్తించాలి. వెంటనే ఫోన్‌ను మార్చేడం చాలా మంచిది. అలా కాకుండా రేడియేషన్‌ ఉన్న ఫోన్‌ వాడడం వలన మెదడుపై ప్రభావం పడి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు పెరుగతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అర్థమైంది కదా.. ఇంకేముంది.. వెంటనే మీ మొబైల్‌లో రేడియేషన్‌ ఎంత ఉంది.. మీరు వాడుతున్న ఫోన్‌ సేఫా.. కాదా అన్న విషయాలు తెలుసుకోండి.