Success formula in life: ఎవరైనా జీవితంలో సక్సెస్ కావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ లైఫ్ అనుకున్న రేంజ్ లో ఉండాలంటే కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉండాలి. వాటిలో సహనం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఎంతో కష్టపడతారు. రాత్రి పగలు తీరిక లేకుండా ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తారు. కానీ ఒక్కసారి సమయం అనుకూలంగా లేకపోతే అనుకున్న పనులు కావు. అయితే అన్ని సమయాలు ఒకే రకంగా ఉండవు. కొన్నిసార్లు కష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలోనే సహనం అనేది తప్పనిసరి. అసలు సహనం ఎలా ఉండాలని ఈ నీతి కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ కథలోకి వెళితే..
బుద్ధుడు ఒకసారి ఒక చెట్టు కింద తపస్సు చేస్తూ ఉంటాడు. ఈ సమయంలో తన శిష్యుడు అని పిలిచి ఒక పాత్రలో నీరు తీసుకురమ్మని చెబుతాడు. తన శిష్యుడు ఆ పాత్రను తీసుకువెళ్లి చెరువు వద్దకు వెళ్తాడు. అయితే అప్పటికే అక్కడ కొన్ని జంతువులు ఆ చెరువును దాటుతూ ఉంటాయి. ఈ క్రమంలో చెరువులో నీళ్లన్నీ మురికిగా మారుతాయి. దీంతో మురికి నీళ్లను తీసుకురాలేక బుద్ధుడి దగ్గరికి వెళ్లి శిష్యుడు ఇలా అంటాడు.. ప్రభువు ప్రస్తుతం చెరువు నీరు మురికిగా మారింది.. ఆ నీరును తీసుకురాలేకపోయాను అని అంటాడు. అప్పుడు బుద్ధుడు ఏం పర్వాలేదు కాసేపు ఆగు అని చెప్తాడు. అలా కొంతసేపటి తర్వాత బుద్ధుడు ఇప్పుడు నీళ్లు తీసుకురామని చెబుతాడు. శిష్యుడు అక్కడికి వెళ్ళేసరికి చెరువులో నీళ్లు స్వచ్ఛంగా మారుతాయి. ఈ సమయంలో మట్టి అడుగు బాగానే చేరిపోతుంది.
ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఒక్కోసారి కష్టాలు మీద పడ్డట్టే వస్తుంటాయి. ఇలాంటి సమయంలోనే మనిషి సహనం కోల్పోకుండా ఉండాలి. ఈ కష్టాలు తొలగిపోయే వరకు వేచి ఉండాలి. మన సహనాన్ని చూసి కష్టాలకు కూడా భయం వేసి అవి వెళ్లిపోతాయని కొందరు అంటారు. అలా ఒక్కసారి సక్సెస్ జర్నీ మొదలైందంటే అప్పుడు ఇక ఏదంటే అది జరుగుతుంది.
అయితే చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు ఏవేవో పొరపాటు చేస్తుంటారు. తమ జీవితం ఇక ముగిసినట్లే అని కుంగిపోతుంటారు. వాస్తవానికి పేదవారికి, ధనవంతులకు ఇద్దరికీ కష్టాలు ఉంటాయి. కానీ ఈ కష్టాలను భరిస్తూ సహనంతో ఉన్నవారు మాత్రమే ధనవంతులుగా మారుతారు. ధనవంతులు అలాగే ఉండిపోతారు. ఈ ఇరు వర్గాల్లో ఎవరు సహనం కోల్పోయిన పేదవారిగానే ఉండిపోతారు. అందువల్ల ప్రతి వ్యక్తి తన జీవితంలో సహనం అనేది అలవాటు చేసుకోవాలి. ఇది కేవలం జీవితానికి సంబంధించింది మాత్రమే కాకుండా ఉద్యోగం, వ్యాపార విషయంలోనూ కూడా సహనం అనేది చాలా ఇంపార్టెంట్ అని కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్నారు.