Healthy teeth tips: మానవ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవడమే కాకుండా.. కొన్ని ఆరోగ్య నియమాలు పాటించాల్సి ఉంటుంది. ప్రతిరోజు చేసే కొన్ని పనుల వల్ల కొత్తగా అనారోగ్యాన్ని తీసుకొచ్చిన వారవుతారు. ఉదయం లేవగానే మొట్టమొదట చేసే పని మౌత్ ఫ్రెష్ చేసుకోవడం. ఇందులో భాగంగా టూత్ బ్రష్ వాడుతూ పళ్ళను శుభ్రం చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ పళ్ళను సరిగ్గా శుభ్రం చేసుకుంటే ఎలాంటి అనారోగ్యాలు ఉండవు. కానీ కొందరు బాగా శుభ్రం చేసుకున్నా కూడా.. బ్రష్ వాడే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. అంటే ఒకే బ్రష్ ను సంవత్సరాల కొద్దీ వాడుతూ ఉంటారు. ఇలా వాడడం వల్ల పళ్ళు బలహీన పడిపోగా.. క్యాన్సర్ వంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి టూత్ బ్రష్ ను ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి?
కొంతమంది వైద్యులు తెలుపుతున్న సూచనలు ప్రకారం.. ప్రతి మూడు నెలలకు ఒకసారి లేదా 90 రోజులకు ఒకసారి టూత్ బ్రష్ ను మార్చాలి. ఎందుకంటే టూత్ బ్రష్ లోని బ్రిస్టిల్స్ వంగిపోతే లేదా అవి ఓడిపోతే.. పళ్ళను బాగా శుభ్రం చేయలేవు. దీంతో ఫ్లూ, జ్వరం, ఇన్ఫెక్షన్, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాగే నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంది. బ్రష్ పై ఒక పొరలాగా ఏర్పడి నోటిలో బ్యాక్టీరియా తయారవుతుంది. అంతేకాకుండా దంతాలు బలహీన పడిపోతాయి. ఫలితంగా బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. ఫంగస్ పెరిగిన తర్వాత క్రమంగా తీవ్ర ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఒకవేళ 90 రోజుల లోపు కూడా బ్రష్ ఇలా ఉంటే దానిని వెంటనే మార్చాలి. పల్లపై ఉన్న ప్లాట్ సరిగ్గా తొలగించలేకపోతే ఆ ప్రశ్న మార్చాలి. అలాగే గట్టి పడిన బ్రిస్టిల్స్ ఉంటే కూడా దానిని వెంటనే తీసేయాలి. ఎక్కువగా బ్యాక్టీరియా బ్రష్ లో పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల పళ్ళను శుభ్రం చేసుకునే ముందు దీనిని బాగా శుభ్రం చేయాలి. నిర్లక్ష్యం చేస్తే అనారోగ్యం మారిన పడే అవకాశం ఉంది. టూత్ బ్రష్లు ఎక్కువగా బాత్రూం వద్ద కాకుండా ఓపెన్ ప్లేస్ లో ఉంచాలి. వీటికి గాలి ఆడటం వల్ల తేమ తొలగిపోయి ఇలాంటి బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. పిల్లల బ్రష్ ను రెండు నెలలకు ఒకసారి మార్చడం మంచిది. ఇతరుల బ్రష్ తో కాలవనీయకుండా వేర్వేరుగా ఉంచడం మంచిది. ఒకసారి వాడిన బ్రష్ ను కాసేపు ఆరనివ్వాలి. ఎందుకంటే ఇందులో కొన్ని రకాల క్రిములు ఉండే అవకాశం ఉంది.