Life after 30 : జీవితం సక్సెస్ఫుల్గా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొందరు మాత్రమే అందుకు అనుకూలంగా అడుగులు వేస్తారు. ఈ పయనంలో కొందరు తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం.. కాకచక్యంగా వ్యవహరించడం.. పద్ధతులు మార్చుకోవడం అంటివి చేస్తారు. మరికొందరు మాత్రం అలాంటివి ఏవి పాటించకుండా ముందుకెళ్తారు. ఒక ప్రణాళిక పద్ధంగా ముందుకు వెళ్లడం ద్వారా జీవితంలో అనుకున్న పనిని వెంటనే సాధించగలుగుతారు. ముఖ్యంగా ఒక వయసు వచ్చిన తర్వాత సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం అని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. సరైన వయసు అంటే ఒక వ్యక్తికి 30 ఏళ్లు. ఈ వయసు దాటిన తర్వాత ఆ వ్యక్తులు అనేక మార్పులు వస్తాయి. ఇలాంటి సమయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయాలు ఏమో ఇప్పుడు చూద్దాం..
ఒక వ్యక్తి చదువు పూర్తయిన తర్వాత పరిపూర్ణ యువకుడిగా మారే సమయం 30 ఏళ్లు. ఈ వయసులో ఆ వ్యక్తి తన జీవితం గురించి ఆలోచించాలి. మరోవైపు కుటుంబం కోసం కష్టపడాలి. ఈ వయసు వరకు వివాహం జరిగినట్లయితే అతనికి రెండు బాధ్యతలు ఉంటాయి. రెండు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే ఓవైపు కెరియర్ విజయం.. మరోవైపు సంతోషకరమైన జీవితం ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో ఎలాంటి కష్టాలు వస్తాయో ఇప్పుడు చూద్దాం..
30 ఏళ్లు దాటిన తర్వాత స్నేహితులు మారిపోతారు. ఉద్యోగం చేసే వారు ఫ్రెండ్స్ అయిపోతారు. ఇలాంటి సమయంలో స్కూల్ లేదా కాలేజీ ఫ్రెండ్స్ ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే చిన్ననాటి జ్ఞాపకాలతో.. చిన్న పాటలతో గడిపే సమయం కాదు. కెరీర్ గురించి మాత్రమే ఆలోచించాలి. అంటే ఉద్యోగంలో ఉండే ఫ్రెండ్స్ తో మాత్రమే చర్చలు జరపాలి.
30 ఏళ్ల వయసు వచ్చేసరికి వివాహం జరిగినట్లయితే కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఓవైపు ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూనే మరోవైపు కుటుంబాన్ని పోషించే బాధ్యత తీసుకోవాలి. ఇంట్లో అవసరాలను తీరుస్తూ.. జీవిత భాగస్వామితో సంయమను పాటించాలి. పని ఒత్తిడి కారణంగా ఇంట్లో వారితో గొడవలు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలోనే ఓర్పు ఉండాలి. ఎందుకంటే ఈ వయసులో కోపం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చెడు నిర్ణయం తీసుకున్న దాని ప్రభావం జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఇప్పటివరకు చేసిన ప్రాజెక్టులను నచ్చకపోతే కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలి. ఎందుకంటే కెరీర్ను మార్చుకునే అవకాశం ఈ వయసులో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు తీసుకొని నిర్ణయాలే జీవితాంతం మంచివా? చెడువా అనేది తేలుతాయి. అందువల్ల కొత్త ప్రాజెక్టులను లేదా కొత్త పనిని ప్రారంభించేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ మార్పు కూడా చేయాలనుకుంటే ఈ సమయంలోనే చేయాల్సి ఉంటుంది.
ఈ సమయంలో కొన్ని పనుల కారణంగా బిజీ వాతావరణంలో ఉంటారు. అయితే విధుల కారణంగా ఆరోగ్యం పై నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. విశ్రాంతి లేకుండా పనులు చేయడం వల్ల ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. ఈ వయసులో అనారోగ్యానికి గురైతే సమయం వృధా అయిపోతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు ఆరోగ్యం విషయంలో కేర్ తీసుకోవాలి.