Iron- Deficiency: మన శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తేనే వ్యవస్థ సజావుగా సాగుతుంది. లేకపోతే ఏ అవయవం మొండికేసినా శరీరం సహకరించదు. అందుకే మన దేహంలో అన్ని భాగాలు మంచిగా పనిచేయాలంటే ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. మనం తినే ఆహారమే మనకు రక్షగా ఉంటుంది. ప్రస్తుతం రుచుల కోసం పాకులాడుతూ పోషకాహారం గురించి మరిచిపోతున్నారు. నూరేళ్లు హాయిగా జీవించాల్సిన శరీరం యాభై ఏళ్లకే పరిమితం అవుతోంది. దీంతో పోషకాహారంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని గుర్తించడం లేదు. ఈ నేపథ్యంలో శరీరంలో ఐరన్ లోపం ప్రధానంగా కనిపిస్తోంది.

ఐరన్ లోపంతో శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అనిపించినా అనుమానం పడాల్సిందే. ఇంకా శ్వాస తీసుకోవడంలో అవాంతరాలు వచ్చినా ఐరన్ లోపమే కారణమవుతుంది. ఐరన్ లోపంతో బాధపడుతున్న వారు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. తరచూ తలనొప్పి వస్తున్నా అనుమానించాల్సిందే. హెమోగ్లోబిన్ తక్కువ అయితే కూడా ఐరన్ లోపం వస్తుందని తెలుస్తోంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గితే తలనొప్పి వస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇది ఐరన్ తక్కువ అవడంతోనే వస్తుందని చెబుతున్నారు. అందుకే ఐరన్ ను తగ్గకుండా చూసుకునే విధంగా ఆహారం తీసుకుంటేనే మేలు.
Also Read: Hardik Pandya : హార్ధిక్ పాండ్యానే టీమిండియా భవిష్యత్ కెప్టెన్ నా?
శరీరం ఎప్పుడు నిస్సత్తువ, అలసట అనిపిస్తున్నా కూడా ఐరన్ లోపమే అని గుర్తించాలి. హిమోగ్లోబిన్ తగ్గడంతో గులాబీ రంగులోకి మారుతుంది. చర్మం తెల్లగా అవుతుంది. ఇంకా నాలుకపై కూడా పలు ఆనవాళ్లు కనిపిస్తాయి. నాలుక పాలిపోయినట్లు అనిపిస్తుంది. కనురెప్పల లోపలి భాగం తెల్లగా మారుతుంది. అందుకే ఐరన్ లోపం లేకుండా చూసుకునేందుకు మంచి ఆహారం తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుందని తెలుసుకోవాలి. మన ఆహారమే మనకు మందులా పనిచేస్తుందని తెలిసినా చాలా మంది పట్టించుకోవడం లేదు.

ఇటీవల కాలంలో అన్ని ఆహార పదార్థాల్లో రసాయనాలు కలిపిన మందులు వాడటంతో రోగాలు చుట్టుముడుతున్నాయి. సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంటలకు మంచి ప్రొటీన్లు ఉంటాయి. కానీ మనకు సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటలు కానరావడం లేదు. ఫలితంగానే రోగాలు దరిచేరుతున్నాయి. ప్రజల్లో చైతన్యం పెరిగి మంచి ప్రొటీన్లు ఉన్న ఆహారాలు తీసుకుంటేనే వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని తెలుస్తోంది. మనం తీసుకునే ఆహారం కూడా మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఇది చాలా మందికి తెలిసినా నిర్లక్ష్యంతోనే లేనిపోని రోగాలు వచ్చేందుకు కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఆకుకూరలు, కూరగాయలు, ఫైబర్ ఉన్న వాటిని ఎక్కువగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. రాబోయే కాలంలో ప్రజలు ఇలాంటి ఆహారాలు తీసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read:Minister Botsa Satyanarayana: మారిన బొత్స తీరు.. అసలు కారణం అదేనా?
[…] Also Read: Iron- Deficiency: ఐరన్ లోపం ఉన్నట్లయితే ఈ లక్షణా… […]