Vastu Tips: మన దేశం సుగంధ ద్రవ్యాలకు పుట్టినిల్లు. విదేశీయులు మన దగ్గర ఉన్న సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసమే మన దేశానికి వచ్చి మన మీద పెత్తనం చెలాయించారు. సుగంధ ద్రవ్యాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. వాటితో మన ఆరోగ్యంతో పాటు వాస్తు పరంగా కూడా ఇబ్బందులు లేకుండా చేస్తాయి. అందుకే వాటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవి వంటింట్లో ఉంటే మనకు అన్ని మంచి శకునాలే. మన విఘ్నాలను తొలగించే మహత్తర శక్తి వీటిలో ఉంటుంది.
లవంగం, సోంపు
మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో లవంగం, సోంపు మనకు వాస్తు పరంగా కూడా సాయపడతాయి. ఇంటి ద్వారానికి సోంపు లేదా లవంగం చిన్న మూట కట్టిపెడితే దెయ్యాలు, భూతాలు రావని నమ్ముతారు. సోంపు దిండు కింద పెట్టుకుంటే మంచి నిద్ర పడుతుంటారు. లవంగాన్ని పర్సులో ఉంచుకుంటే ప్రతికూలతలను దూరం చేస్తుంది. ఇలా సోంపు, లవంగం మనకు ఎన్నో రకాల మేలు చేస్తాయని తెలుస్తోంది. అందుకే వాటిని మనం ఇంట్లో ఉంచుకోవడం సురక్షితం.
కూరల్లో రుచికి..
సోంపు, లవంగం తినడం వల్ల సంతానోత్పత్తి, దీర్ఘాయువు, ఆరోగ్యం, జ్ణాపకశక్తి, ధైర్యం, బలం పెరుగుతాయని విశ్వసిస్తారు. లక్ష్మీదేవికి ఎర్రగులాబీలతో పాటు లవంగాలు కలిపి పూజ చేయడం వల్ల మంచి అదృష్టం పడుతుందని చెబుతుంటారు. సోంపు, లవంగాలతో మన కూరల రుచులు కూడా మారుతాయి. మంచి రుచికరంగా ఉండాలంటే వీటిని కూరల్లో వాడాల్సిందే.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్క కూడా మన సంపదను పెంచడంలో సాయపడుతుంది. డబ్బు పెంచుకోవడానికి చేయాల్సందేమిటంటే దాల్చిన చెక్కను పర్సులో ఉంచుకుంటే సరి. ఇది మనకు ఆరోగ్యం, ప్రేమ, విజయం సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని దగ్గర ఉంచుకోవడం వల్ల మన చుట్టూ పాజిటివిటీ పెరుగుతుందని నమ్ముతుంటారు.
పుదీనా ఆకులు
పుదీనా ఆకులు కూడా మనకు సంపద పెరిగేలా చేస్తాయి. ఆరోగ్యాన్ని అందివ్వడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. పెట్టుబడులు పెడితే సంపద రావడానికి కారణమవుతుంది. ఇంకా యాలకులు, నల్ల మిరియాలు తీసుకుంటే కూడా మన కష్టాలు తీరుతాయి. యాలకులు తినడం వల్ల మంచి జరుగుతుంది. ఇలా సుగంధ ద్రవ్యాలు మన ఆరోగ్యం, సంపదను పెంచేందుకు సాయపడతాయి.