Rashmi Gautam: స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని గ్లామర్ రష్మీ గౌతమ్ సొంతం. కాలం కలిసి రాలేదు కానీ హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ ని ఏలేయాల్సింది. అసలు రష్మీ కెరీర్ మొదలైంది నటిగానే. ఆమె హీరోయిన్ కావాలని పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితే ఆమెకు సపోర్టింగ్ రోల్స్ మాత్రమే దక్కాయి. ఎంతకీ హీరోయిన్ గా ఆఫర్స్ రాకపోవంతో యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. వ్యక్తిగత కారణాలతో అనసూయ జబర్దస్త్ షో నుండి తప్పుకుంది. దాంతో రష్మీకి ఛాన్స్ దక్కింది. అది ఆమె ఫేట్ మార్చేసింది.
జబర్దస్త్ యాంకర్ గా రష్మీ పిచ్చ పాప్యులర్ అయ్యారు. భారీ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. జబర్దస్త్ ట్రెమండస్ సక్సెస్ కావడం రష్మీకి ప్లస్ అయ్యింది. ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ మరో షో స్టార్ట్ చేయడంతో అనసూయ రీఎంట్రీ ఇచ్చింది. ఆ విధంగా ఇద్దరూ పరిశ్రమలో సెటిల్ అయ్యారు. స్టార్ యాంకర్ అయ్యాక హీరోయిన్ కావాలన్న రష్మీ కోరిక తీరింది. రష్మీ పది చిత్రాల వరకు చేశారు. గుంటూరు టాకీస్, అంతకు మించితో పాటు పలు చిత్రాల్లో బోల్డ్ రోల్స్ చేసింది.
అయితే రష్మీకి ఒక్క హిట్ కూడా పడలేదు. ఆమె హీరోయిన్ గా నటించిన చిత్రాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ రష్మీ నటించిన చివరి చిత్రం. ఆమె ఎలాంటి కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేసిన దాఖలాలు లేవు. అయితే హీరోయిన్ గా ఆమె కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. టాప్ రేటెడ్ షోస్ గా ఉన్న ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో ఆమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రమోషన్స్ ఈవెంట్స్ ద్వారా బాగా ఆర్జిస్తున్నారు.
ఇక సోషల్ మీడియా రష్మీ సందడి మామూలుగా ఉండదు. తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. తాజాగా ట్రెండీ అవుట్ ఫిట్ లో వంగి వంగి పరువాలు వడ్డించింది. రష్మీ గ్లామరస్ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ తమ డిమాండ్స్ వినిపిస్తున్నారు. మీరు అందంగా ఉన్నారు, సుధీర్ అన్నతో కలిసి ఒక మూవీ చేయాలని కోరుతున్నారు. మరి వారి కోరికను రష్మీ నెరవేరుస్తుందో లేదో చూడాలి. ఏళ్లపాటు రష్మీ-సుడిగాలి సుధీర్ బుల్లితెర ప్రేమికులుగా వెలుగొందారు.
View this post on Instagram