
Vastu Tips: మనం వాస్తును నమ్ముతాం. మన ఇంటి ఆవరణలో రకరకాల చెట్లు, మొక్కలు నాటేందుకు ఇష్టపడుతుంటాం.ఇల్లు కట్టుకునేటప్పుడే మొక్కలు పెడతాం. ఇందులో కొన్ని పూలు ఇచ్చేవి ఉంటే మరికొన్ని పండ్లు ఇచ్చేవి ఉంటాయి. వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుని నాటుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో మన ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచుకుని వాటిని చూసి మురిసిపోతాం. చూడముచ్చటగా ఉండే మొక్కలతో మనకు ఆహ్లాదం కలుగుతుంది.
ఎక్కడ పెంచాలి
మొక్కల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు ప్రకారం ఎటు వైపు పెంచితే మంచిదో తెలుసుకుని
నాటాలి. అప్పుడే మనకు ఇబ్బందులు రావు. దీంతో మొక్కలు పెంపకంలో ఏ దిక్కు ఉత్తమంగా ఉంటుందో తెలుసుకోవాలి. దీని వల్ల మనకు వాస్తు దోషాలు రాకుండా ఉంటాయి. దీంతోనే మనం వాస్తు పద్ధతులు కచ్చితంగా అమలు చేస్తేనే మనకు మంచిది.
ఏ మొక్కలు నాటాలి
మొక్కల పెంపకంలో కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముళ్లు ఉండే మొక్కలను పెంచడం
మంచిది కాదు. పూల మొక్కలను నాటితే మంచి లాభాలు ఉంటాయి. ముళ్లు ఉండే చెట్లను మాత్రం
నాటితే మనకు కష్టాలే కలుగుతాయనడంలో సందేహం లేదు. పూల మొక్కలు చూడటానికి కూడా
అందంగా కనిపిస్తాయి.
రేగు మొక్క వద్దు
రేగు చెట్టుకు ముళ్లు ఉంటాయి. అందుకే మన ఇంటి ఆవరణలో రేగు చెట్టు ఉండకూడదు. దీని వల్ల
ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. అనారోగ్యాలు వస్తాయి. కుటుంబ సభ్యుల్లో సఖ్యత దెబ్బ తింటుంది. అందుకే రేగు చెట్టు ఇంటి ఆవరణలో ఉండటం సురక్షితం కాదు. ముళ్ల చెట్లు అసలు నాటకూడదని తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుంటే సరి.

మర్రి, రావి చెట్లు
ఇంటి ఆవరణలో మర్రి చెట్టు కూడా ఉండకూడదు. మర్రి చెట్టు పెట్టిన వాడి ఆయుష్షు తగ్గుతుందంటారు. అందుకే ఇంటి ఆవరణలో మర్రి మొక్క ఉండకూడదు. ఒక వేళ మొలిచినా పీకేయాలి. ఇంకా రావి చెట్టు కూడా ఉండకూడదు. రావి చెట్టు దేవాలయ ఆవరణలో ఉంటేనే మంచిది. ఇంటి ఆవరణలో ఎట్టి పరిస్థితుల్లో ఉండటం సురక్షితం కాదు.
పాక, ఖర్జూరాల చెట్లు నాటొద్దు
మన ఇంటికి దక్షిణ ఆవరణలో పాక చెట్టు ఉండకూడదు. దీని వల్ల కూడా మనకు నష్టాలు కలుగుతాయి.ఇంటి ఆవరణలో ఖర్జూరా చెట్టు కూడా ఉండొద్దు. ఖర్జూరా పండ్లు తియ్యగా ఉంటాయి. కానీ ఆ చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే అనర్థాలే వస్తాయి. దీని వల్ల ఆర్థిక సంక్షోభం కలుగుతుంది. పనస చెట్టు కూడా నాటకూడదు. దీన్ని నాటితే మనకు ఆర్థిక ఇబ్బందులు రావడం సహజమే.