Fenugreek: చలికాలంలో తిన్నది సరిగా జీర్ణం కావడం లేదా? మెంతితో చెక్ పెట్టండిలా..

కూర వండేటప్పుడు కాస్త టేస్టీ కోసం కొత్తిమీర, పూదీన వేస్తుంటాం. కానీ మెంతి కూడా చాలా మంది వాడుతారు. కొందరు మాత్రం దీనిని పట్టించుకోరు. అయితే మెంతిలో ఉండే ప్రయోజనాల గురించి తెలిస్తే విడిచిపెట్టరు.

Written By: Srinivas, Updated On : November 14, 2023 7:21 pm

Fenugreek

Follow us on

Fenugreek: వర్షాకాలం తరువాత వచ్చే చలికాలంలో అనేక ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. తీవ్ర చలిలో కొందరి కొందరు దగ్గు, జలుబున బారిన పడి బాధపడుతూ ఉంటారు. వీటితో పాటు సీజనల్ వ్యాధులు వేధిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరగాలంటే కేవలం మెడిసిన్స్ మాత్రమే కాకుండా మార్కెట్లో లభించే కొన్ని కూరగాయలను తప్పకుండా తీసుకోవాలి. వీటిలో ప్రధానంగా ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. ఆకు కూరల్లో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి లభిస్తుంది. చలికాలంలో ప్రధానంగా మెంతి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే?

కూర వండేటప్పుడు కాస్త టేస్టీ కోసం కొత్తిమీర, పూదీన వేస్తుంటాం. కానీ మెంతి కూడా చాలా మంది వాడుతారు. కొందరు మాత్రం దీనిని పట్టించుకోరు. అయితే మెంతిలో ఉండే ప్రయోజనాల గురించి తెలిస్తే విడిచిపెట్టరు. మెంతిలో అనేక విటమిన్లు ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, సి తో పాటు పోటాషియం, సెలినియం, మాంగనీసు అనే ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా చలికాంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. అంతేకాకుండా ఎలాంటి వైరస్ లు దాడి చేయకుండా అడ్డుకుంటాయి.

మెంతిని నేరుగా తీసుకోవడం కాస్త ఇబ్బందే. అయితే దీనిని వివిధ రకాలుగా తీసుకోవచ్చు. మెంతిని కూరల్లో వేసుకోవడం ద్వారా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుతో పాటు మెంతికూర చాలా రుచికరంగా ఉంటుంది. మెంతి ఆకులతో పరోటా కూడా చేస్తారు. అలాగే దీనిని నేరుగా తీసుకోవాలంటే సలాడ్ ద్వారా తీసుకోవచ్చు. మెంతి ఆకులు కాస్త చేదుగా ఉన్నా.. వీటికి కాంబినేషన్ ను కలిపితే అద్భుతమైన రుచి వస్తుంది.

చలికాలంలో ఎక్కువగా అజీర్ణ సమస్యలు వస్తుంటాయి. తిన్న ఆహరం త్వరగా జీర్ణమవదు. దీంతో మెంతిని తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. మధుమేహవ్యాధిగ్రస్తులకు మెంతి దివ్యౌషధం లా పనిచేస్తుంది. వీరు మెంతి జ్యూస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి. సాధారణ వ్యక్తులు కూడా మెంతి జ్యూస్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో పొట్ట పెరగకుండా ఆపుతుంది. ఉదయం మెంతి జ్యూస్ తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉంటారు. బరువు తగ్గాలనుకునేవారికి మెంది మంచి ఔషధం లా పనిచేస్తుంది.