Chanakya Niti: మన చరిత్రలో పేర్కొన్న అపర మేధావులలో ఆచార్య చాణిక్యుడు ఒకరు.ఈయన ఒక మనిషి జీవితం విజయవంతంగా ముందుకు సాగాలంటే ఎలాంటి అలవాట్లు నేర్చుకోవాలి ఎటువంటి లక్షణాలు ఉన్న వారికి దూరంగా ఉండాలి అనే విషయాల గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు. అయితే ఆచార్య చాణక్యుని చాలా మంది స్త్రీ ద్వేషి అనీ భావించేవారు.కానీ అసలు నిజం ఇది కాదు స్త్రీలలో ఉన్న కొన్ని లక్షణాలు అతనికి నచ్చక పోవడం వల్ల చాలామంది ఆయనను స్త్రీ ద్వేషి అని భావించేవారు. అయితే మహిళలలో రెండు లక్షణాలు ఉన్న మహిళలను పొరపాటున కూడా నమ్మకూడదని ఆచార్య చాణక్యుడు తన నీతి ద్వారా తెలియజేశారు. మరి ఆ లక్షణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
అత్యాశ: అత్యాశ కలిగిన స్త్రీలను పొరపాటున కూడా నమ్మకూడదని ఇలాంటి లక్షణం కల స్త్రీతో సహవాసం కూడా చాలా ప్రమాదమని ఆచార్య చాణిక్యుడు వెల్లడించారు. ఇలాంటి వారు నిత్యం తన స్వంత ప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచిస్తారు.ఈ విధంగా అత్యాశ కలిగిన స్త్రీలు ముందు తన స్వార్థం ఆలోచించి అనంతరం తన పిల్లల గురించి ఆలోచించే అలవాటు ఉంటుంది కనుక పొరపాటున కూడా ఈ విధమైనటువంటి లక్షణం ఉన్న స్త్రీలను నమ్మకూడదు అని ఆచార్య చాణక్యుని నీతి గ్రంథం ద్వారా తెలియజేశారు.
Also Read: భారీ స్కాంలో సీనియర్ నటుడు నరేష్ మాజీ భార్య.. అసలు ఆమె ఏం చేసిందో తెలుసా?
బద్ధకం: బద్ధకం అనేది ప్రతి ఒక్కరి విజయానికి ఆటంకం కలిగించే విషయం.ఎవరైతే బద్ధకంగా ఉంటారో అలాంటి వారికి విజయం వారి దరిదాపుల్లోకి కూడా రాదు. అందుకే బద్ధకం కలిగిన స్త్రీలతో సహవాసం మంచిది కాదని ఇలాంటి లక్షణాలు ఉన్న వారిని వీలైనంతవరకు దూరం పెట్టాలని ఆచార్య చాణిక్యుడు తెలియజేశారు. ముఖ్యంగా ఈ విధమైనటువంటి లక్షణం కలిగిన స్త్రీలను జీవిత భాగస్వామిగా చేసుకోకూడదు. ఇలాంటి వారితో జీవితం పంచుకుంటే వారి జీవితం నరకమే అని ఆచారి చాణిక్యుడు తెలియజేశారు.ఇలా బద్ధకం కలిగినవారు విజయానికి కూడా దూరమవుతారు కనుక వీరితో స్నేహం చేయకపోవడమే మంచిది. ఈ విధంగా అత్యాశ బద్ధకం రెండు లక్షణాలు కలిగిన స్త్రీలను నమ్మకూడదని, ఇలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిదని ఆచార్య చాణక్యుడు తెలిపారు.
Also Read: అక్కడమ్మాయి.. ఇక్కడ అబ్బాయి నుంచి భీమ్లానాయక్ వరకూ.. పవన్ ‘పవర్’ ఎంత?
Recommended Video: