AP New Districts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన రావడంతో చాలా ప్రాంతాల్లో నిరసనలు పెరుగుతున్నాయి. ప్రతిపక్షం నుంచి కాకుండా సొంత పక్షం నుంచే విమర్శలు వస్తున్నాయి. వైసీపీ నేతలే రోడ్లెక్కి నిరసన గళం విప్పుతున్నారు. తమ పరపతి నిరూపించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా విచ్చిన వినతుల నుంచి పరిష్కరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
దాదాపు అన్ని జిల్లాల్లో కూడా నిరసనలు వస్తున్నాయి. అత్యధికంగా హిందూపురం నుంచి వినతులు వచ్చినట్లు తెలుస్తోంది. హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని 350 అర్జీలు రావడంతో ప్రభుత్వం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో అని అందరిలో అనుమానాలు వస్తున్నాయి. కానీ కొత్త జిల్లాల ప్రతిపాదనతో ప్రభుత్వం డోలాయమానంలో పడినట్లు అయింది.
Also Read: మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే జీవో 217 వెనక్కి తీసుకోవాల్సిందేనా?
కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలు, సలహాలు, సూచనలపై సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు ముందుకు రావడం ఆహ్వానించదగినదే. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటులో వచ్చిన వినతుల ప్రకారం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుని వచ్చిన వినతులను పరిష్కరిస్తుందో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో వైసీపీకి నూతన జిల్లాల ఏర్పాటు ఓ ప్రహసనంగా మారనుంది.
గతంలో చంద్రబాబు హయాంలో కూడా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన వచ్చినా అప్పుడు ఆయన సాహసం చేయలేదు. ఇలాగే అడ్డంకులు వస్తాయని భావించి ఆ తతంగానికి పూనుకోలేదు. కానీ ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ఈ సాహసం చేయడంతో ఇది ఎందాకా వెళ్తుందో తెలియడం లేదు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను ప్రభుత్వం ఏ మేరకు పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే.
మచిలీపట్నంకు ఎన్టీఆర్ పేరు పెడుతున్నారు. కానీ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని సూచిస్తున్నారు. విజయవాడకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం వీటిపై ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో తెలియడం లేదు కానీ ప్రజల నుంచి వచ్చిన వినతులకు మోక్షం లభిస్తుందో లేదో అనే సంశయాలు వస్తున్నాయి.
Also Read: బీజేపీకి సైతం అసమ్మతి పొగ తప్పడం లేదా?