ప్రస్తుత కాలంలో చాలామంది ఇంట్లో వండిన ఆహారం కంటే ప్రాసెస్ ఫ్రూట్ కోసం ఎక్కువగా ఆరాటపడుతున్నారు. మంచూరియా, ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యాని వంటి ఫుడ్ కు ఎక్కువగా మోజు పెంచుకుంటున్నారు. ఇలాంటి ఆహార పదార్థాల్లో యూరిక్ ఆసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి. దీంతో శక్తి నశిస్తుంది. శారీరకంగా శ్రమను ఖర్చు చేసే వారికి ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిత్యం ఏదో రకమైన పెయిన్స్ తో బాధపడుతూ ఉంటారు.
వేసవికాలం రాగానే చాలామంది చల్లబడాలని చూస్తారు. ఇందుకోసం సాఫ్ట్ డ్రింక్ కోసం ఎగబడతారు. సాఫ్ట్ డ్రింక్ తాత్కాలికంగా ఉపశమనాన్ని కలిగించినా.. ఆ తర్వాత అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. వీటిలో ఎక్కువగా పోస్పొరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్లి జీర్ణం కాకుండా చేస్తోంది. ఇలా సరైన సమయానికి ఆహారం జీర్ణం కాకపోవడంతో బలహీనంగా మారి అలసట వస్తుంది. అందువల్ల నిత్యం సాఫ్ట్ డ్రింక్స్ కాకుండా మజ్జిగ లేదా పెరుగు వంటి వాటిని అలవాటు చేసుకోవాలి.
కొందరు ఉద్యోగం, వ్యాపారంలో పడి రోజుకు కనీసం ఐదు నుంచి పది వరకు, కాఫీలు తాగే వారు ఉన్నారు. ఇంకొందరు నిద్ర పోవడానికి టి ని ఎక్కువ తాగుతూ ఉంటారు. అయితే వీటిలో ఉండే కెఫెన్ కారణంగా మెదడుపై ప్రభావం చూపుతుంది. ఇవి ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు బలహీనంగా మారుస్తాయి. అలాగే కడుపులో అలర్జీగా మారి జీర్ణం కావడానికి సమస్య ఏర్పడుతుంది. ఇవి కొందరిలో అల్సర్లు తయారు చేస్తాయి.
మద్యపానం లేకుండా నిద్రపోని వారు చాలామంది ఉన్నారు. కొందరు ప్రతిరోజు కచ్చితంగా రెండు పెగ్గులైన పుచ్చుకునేవారు ఉన్నారు. అయితే నిత్యం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా ఎముకలపై ప్రభావం పడుతుంది. ఇది బలహీనంగా మారి శక్తిని కోల్పోతారు. అందువల్ల ఆల్కహాల్ కు దూరంగా ఉండి సాంప్రదాయ పానీయాలను తాగే అలవాటు చేసుకోండి. వీటితోపాటు నూనెలో వేయించిన పదార్థాలను తినడానికి చాలామంది లైక్ చేస్తారు. కానీ ఇవి తినడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయిని పెంచుతాయి. కొవ్వు అధికంగా ఉండడం వల్ల రక్తప్రసరణ లో ఇబ్బందులు ఏర్పడతాయి. దీంతో గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల నాణ్యమైన ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయండి.