NTR: ఎన్టీయార్ ఆ సినిమా మేకోవర్ పనుల్లో బిజీ కానున్నాడా..?

నిజానికి ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మాస్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. కాబట్టి ఎన్టీఆర్ కెరియర్ మొదట్లో విపరీతమైన మాస్ సినిమాలు చేసి ప్రస్తుతం వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకొని చేస్తున్నాడు.

Written By: Gopi, Updated On : June 16, 2024 2:15 pm

NTR

Follow us on

NTR: నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోవ తరం నటుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన హీరో జూనియర్ ఎన్టీయార్… ప్రస్తుతం ఆయన దేవర అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా తర్వాత వార్ 2 సినిమా మీద తన స్పెషల్ ఫోకస్ ని పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ రెండు సినిమాలను ఈ సంవత్సరంలో కంప్లీట్ చేసి వచ్చే సంవత్సరం నుంచి కన్నడ స్టార్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సినిమా మీద తన స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన బాడీ గాని, లుక్కు గాని ఎలా ఉండాలి అనే దానిమీద ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి ఒక క్లారిటీ అయితే ఇచ్చారట. ఇక ఈ సినిమాలు పూర్తి అవ్వడమే ఆలస్యం ఆయన ప్రశాంత్ నీల్ సినిమా మేకోవర్ పనుల్లో బిజీ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ప్రశాంత్ నీల్ చేయబోయే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఆయనకు మాస్ లో మరింత ఫాలోయింగ్ తెచ్చిపెడుతుందంటూ ఆయన మంచి కాన్ఫిడెంట్ ను అయితే వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మాస్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. కాబట్టి ఎన్టీఆర్ కెరియర్ మొదట్లో విపరీతమైన మాస్ సినిమాలు చేసి ప్రస్తుతం వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకొని చేస్తున్నాడు. కానీ ఎన్టీఆర్ మాస్ సినిమా చేస్తే మాత్రం నిజంగా ప్రేక్షకులు ఆ సినిమా కోసం బ్రహ్మరథం పడతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ మూడు సినిమాలతో కూడా భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాలు కెరియర్ పరంగా ఆయనకు ఎలాంటి మైలేజ్ ఇస్తాయి అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఎన్టీయార్ ఇప్పటికే వరుసగా 6 సక్సెస్ లను అందుకున్నాడు. కాబట్టి దేవర సినిమా తో 7 వ సక్సెస్ ను కూడా తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…