Truths of Life : మీరు ఒప్పుకోకపోయిన లైఫ్ లో నమ్మాల్సిన జీవిత సత్యాలు ఇవే!

లైఫ్ లో మనం ఒప్పుకున్న, ఒప్పుకోకపోయిన కొన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయి. అయితే వీటిని కొందరు అంగీకరించలేక ప్రతి చిన్న విషయానికి బాధ పడుతుంటారు. లైఫ్ లో కొన్ని విషయాలను మనం ఒప్పుకున్న లేకపోయిన అంగీకరించాల్సిందే. అప్పుడే లైఫ్ బాగుంటుంది. మరి ఆ విషయాలు ఏంటో చూద్దాం.

Written By: Kusuma Aggunna, Updated On : September 16, 2024 9:05 am

Truths of Life

Follow us on

Truths of Life : ప్రతి ఒక్కరూ వాళ్ల లైఫ్ లో ఒక్కసారి అయిన ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. వీటికి ముఖ్య కారణం మన ఆలోచన మాత్రమే. లైఫ్ లో కొన్ని నిజాలను ఒప్పుకోవాల్సిందే. చాలా మంది చిన్న విషయాలకు తెగ ఫీల్ అవుతుంటారు. మనం ఎంత ఫీల్ అయిన.. కొన్ని విషయాలు అవ్వాలని ఉంటేనే అవుతుంటాయి. అయితే లైఫ్ లో మనం ఒప్పుకున్న, ఒప్పుకోకపోయిన కొన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయి. అయితే వీటిని కొందరు అంగీకరించలేక ప్రతి చిన్న విషయానికి బాధ పడుతుంటారు. లైఫ్ లో కొన్ని విషయాలను మనం ఒప్పుకున్న లేకపోయిన అంగీకరించాల్సిందే. అప్పుడే లైఫ్ బాగుంటుంది. మరి ఆ విషయాలు ఏంటో చూద్దాం.

జీవితంలో ఏది శాశ్వతం కాదు
లైఫ్ లో ఏది శాశ్వతం కాదు. మనుషుల దగ్గర నుంచి వస్తువులు, వాళ్ల ప్రవర్తన అన్ని కూడా అలాగే ఉండిపోతాయని అనుకోవడం మూర్ఖత్వమే. పరిస్థితుల బట్టి మనుషులు మారిపోతుంటారు. కాబట్టి మన ఆలోచన మార్చుకోవాలి. అప్పుడే లైఫ్ లో కొన్ని సమస్యలను అధిగమించవచ్చు.

సంతోషం మీ చేతుల్లోనే
సంతోషం అనేది వేరే వాళ్ల దగ్గర మనం వెతుక్కోకూడదు. మన సంతోషానికి మనమే కారణం. కాబట్టి చిన్న చిన్న విషయాలకు బాధపడి మీ సంతోషాన్ని మీరే దూరం చేసుకోవద్దు. లైఫ్ లో ప్రాబ్లమ్స్ అనేవి సర్వసాధారణం. వీటన్నింటిని పక్కన పెట్టి ఎప్పుడూ సంతోషంగా ఉండండి. మీ సంతోషానికి కారణం అయిన వాళ్లతో ఎక్కువగా సమయం గడపండి. బాధ పడుతూ కూర్చోని ఉండాలా, సంతోషంగా ఉండాలా అనేది కేవలం మీ చేతుల్లోనే ఉంటుంది.

అందరికీ మనం నచ్చాలని రూల్ లేదు
ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనం నచ్చాలని రూల్ లేదు. కొందరికి నచ్చితే.. మరికొందరికి నచ్చకపోవచ్చు. కాబట్టి ఎవరికో నచ్చలేదని బాధ పడవద్దు. మీకు నచ్చినట్టు సంతోషంగా ఉండండి. ఎవరో ఏదో అనుకుంటారని అనుకోవద్దు. ఏం చేసిన ఏదో ఒకటి అంటూనే ఉంటారు.

ఎక్కువగా ఆశించవద్దు
జీవితంలో ఎన్నో సాధించాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. అనుకున్నవన్నీ జరగవని నమ్మండి. మీ ప్రయత్నం మీరు చేయండి. ఫలితం కోసం ఎక్కువగా ఆశించి బాధ పడవద్దు. అది కేరీర్ లేదా వ్యక్తి విషయంలో అయిన ఎక్కువగా ఆశించి బాధ పడవద్దు.

గొడవలు సహజం
ఎక్కువ మంది చిన్న గొడవలకు ఇష్టమైన వాళ్లని వదులుకుంటారు. ఏ బంధంలో అయిన గొడవలు సహజం. ఇది తెలుసుకున్న వాళ్లు బంధాలను వదిలేయరు. గొడవ ఎందుకు వచ్చిందో తెలుసుకుని సాల్వ్ చేసుకోవాలి. ఇవన్నీ లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే అని తెలుసుకుని అర్ధం చేసుకోవాలి. అప్పుడే లైఫ్ లో ఎలాంటి సమస్యలు వచ్చిన ఎక్కువగా బాధ పడరు.