https://oktelugu.com/

 House : అపార్ట్‌మెంట్.. హైరైజ్, ఇండిపెండెంట్ హౌస్.. మూడింట్లో ఏది బెటర్?

అపార్టుమెంట్లు అంటే ఒకప్పుడు ఓ నాలుగు లేదా ఐదు అంతస్తుల వరకు నిర్మితమయ్యేవి. లేదంటే ఏడు నుంచి ఎనిమిది అంతస్తులు కూడా ఉండేవి. అంతకుమించి ఎక్కడా కూడా కనిపించేవి కావు. కానీ.. ఇప్పుడు కాలం మారింది. ఆ ఏడెనిమిది అంతస్తుల అపార్టుమెంట్లు ఇప్పుడు చిన్నవిగా కనిపిస్తున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : September 16, 2024 4:07 pm
    House

    House

    Follow us on

    House :  ఎవరికైనా సొంతింటి కల ఉంటుంది. కొందరికైతే అది జీవిత లక్ష్యం కూడా. ఆ కలను నెరవేర్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చిన్నదైనా.. పెద్దదైనా ఒక ఇల్లు ఉంటే చాలని అనుకుంటుంటారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు అటు రియల్ ఎస్టేట్‌లోనూ పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నాయి. రెంట్లు కట్టలేక సొంతిల్లు ప్లాన్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో బిల్డర్లు తమ రియల్ ఎస్టేట్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు.

    అపార్టుమెంట్లు అంటే ఒకప్పుడు ఓ నాలుగు లేదా ఐదు అంతస్తుల వరకు నిర్మితమయ్యేవి. లేదంటే ఏడు నుంచి ఎనిమిది అంతస్తులు కూడా ఉండేవి. అంతకుమించి ఎక్కడా కూడా కనిపించేవి కావు. కానీ.. ఇప్పుడు కాలం మారింది. ఆ ఏడెనిమిది అంతస్తుల అపార్టుమెంట్లు ఇప్పుడు చిన్నవిగా కనిపిస్తున్నాయి. వాటి స్థానంలో బహుళ అంతస్తుల అపార్టుమెంట్లు వెలుస్తున్నాయి. ఒక్కొక్కటి 18 నుంచి 60 అంతస్తుల వరకు కడుతున్నారు. అయితే.. చాలా మందికి ఎలా తీసుకోవాలి..? ఎన్ని అంతస్తుల్లో ఉన్న అపార్టుమెంటులో ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుంది..? అని తెలియదు. ఎలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందో ఒకసారి తెలుసుకుందాం.

    ఒక అపార్ట్మెంట్ నిర్మించాలంటే దానికి ఎన్నో రకాల నిబంధనలు ఉంటాయి. వాటన్నింటినీ పాటిస్తూనే నిర్మించాల్సి ఉంటుంది. కనీసం 300 నుంచి 500 గజాల్లో ఐదు అంతస్తుల వరకు అపార్ట్‌మెంట్ నిర్మించి 20 నుంచి 30 ఫ్లాట్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. ఇలాంటి అపార్టుమెంట్లలో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ అంతగా లగ్జరీగా ఉండవు. జనరేటర్, వాచ్‌మన్, లిఫ్ట్ లాంటి సదుపాయాలు ఉంటాయి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వరకు ప్రజలు లగ్జరీ లైఫ్‌ను కోరుకుంటున్నారు. అలాంటి సౌకర్యాలు వీటిల్లో కనిపించవు. 5 అంతస్తుల్లోపు అపార్ట్‌మెంట్లు ఎక్కువగా మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో ఉంటాయి.

    ప్రజల నుంచి హైరేంజ్ సదుపాయాలతో కూడిన విల్లాలు, అపార్ట్‌మెంట్ల కోసం డిమాండ్ వినిపిస్తోంది. దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ దిశగా దృష్టి సారించారు. హైదరాబాద్‌లో ఇప్పుడు ఏకంగా 60 ఫ్లోర్లతో కమ్యూనిటీలు నిర్మిస్తున్నారు. ఏకంగా రెండు మూడు ఎకరాల్లో వీటిని నిర్మిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలతో నిర్మిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. అక్కడ హైసెక్యూరిటీ, సీసీ టీవీ కెమెరాలు అందుబాటులో పెడుతున్నారు. సూపర్ మార్కెట్ నుంచి మొదలుకొని పార్కులు, ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జిమ్, ప్లేస్కూల్స్, డే కేర్ సెంటర్స్, ట్యూషన్, మినీ థియేటర్, ఫంక్షన్ హాల్స్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఫ్లాట్ కొన్న వారు ఇక దేని కోసం బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇక్కడ మెయింటనెన్స్ సైతం ఎక్కేవ.

    అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. భార్యాభర్తలిద్దరు సంపాదన పరులైతే కొన్ని విషయాల్లో గేటెడ్ కమ్యూనిటీ బెటర్ అని అంటున్నారు. లేదంటే బడ్జెట్‌ను బట్టే ఇల్లు ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. హంగులు ఆర్భాటాలు అంటూ పోతే జీవితాలు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. లగ్జరీ లైఫ్ అనుభవించాలని ఉన్నప్పటికీ.. వాటిని తగినట్లుగా సంపాదన లేకుంటే మొదటికే మోసం వస్తుందని అంటున్నారు. ఆర్థిక సామర్థ్యాన్ని చూసుకొనే ముందడుగు వేయాలని చెబుతున్నారు.