
Top 5 players of IPL : మరికొన్ని రోజుల్లో సగటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందడి మొదలు కాబోతోంది. ఇప్పటికే క్రికెటర్ల వేలం కూడా ముగిసింది. కెప్టెన్స్ ఎంపిక కూడా పూర్తయింది. ఏటేటా అపీఎల్ క్రేజీ పెరుగుతండడంతో సీనియర్ క్రికెటర్లు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. కోచ్‌గా, మెంటర్‌గా ఇప్పటికే చాలామంది సీనియర్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ స్టాటర్ క్రికెటర్ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈసారి ఐపీఎల్ లో పెద్ద స్టార్లుగా ఎదిగే టాప్–5 యంగ్ ప్లేయర్స్‌ను సెలక్ట్ చేశాడు
-ఆ ఐదుగురు వీరే..
ఐపీఎల్ భవిష్యత్‌లో స్టార్ ఆటగాళ్లుగా మారే ఐదుగురు ప్లేయర్స్‌ను సెలక్ట్ చేశాడు దాదా. అయితే ఈ ఐదుగురు యంగ్ ప్లేయర్స్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కలేదు. గంగూలీ టాప్ 5 ప్లేయర్స్‌లో పృథ్వీ షా టాప్ వన్‌గా నిలిచాడు. ఆ తర్వాత రెండు మూడు స్థానాలకు రిషభ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్‌ను దాదా తీసుకున్నాడు. మిగతా ఇద్దరిలో టీమిండియా స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్, శుభ్‌మన్‌గిల్‌ను సెలక్ట్ చేశాడు. ఈ ఐదురుగురే ఐపీఎల్‌లో టాప్–5 యంగ్ ప్లేయర్స్ అని సౌరవ్ తెలిపాడు. పంత్ ఈసారి ఐపీఎల్ ఆడనప్పటికీ అతడిని దాదా టాప్ 5లో ఎంపిక చేయడం గమనార్హం.
30 ప్లస్‌కు నో ఛాన్స్..
గంగూలీ తన జాబితాలో 30 ప్లస్ ఏజ్ వారిని తీసుకోలేదు. దీంతో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ వారికి స్థానం దక్కలేదని తెలుస్తోంది. ఫ్యూచర్ బెస్ట్ టాప్5 ప్లేయర్స్‌ను మాత్రమే దాదా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సూర్య కుమార్‌ను స్పెషల్ కేటగిరీలో తీసుకున్నాడు. వీరందరు ఎలాంటి ఆటగాళ్లో మీకు తెలిసిన విషయమే అని గంగూలీ పేర్కొన్నాడు. ఈ షోలో గంగూలీతోపాటు పాల్గొన్న మాజీ స్పిన్నర్ హర్భజన్ యంగ్ ప్లేయర్ గిల్ గురించి అడగ్గానే అతడిని కూడా స్పెషల్ కేటగిరీలో తీసుకున్నాడు.
ఐపీఎల్ క్రేజీ పెంచేందుకే దాదా టాప్5 క్రికెటర్స్‌ను ఎంపిక చేసి ఉండవచ్చని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా గంగూలీ సెలక్షన్‌ను కొందరు స్వాగతిస్తుండగా, కొందరు వ్యతిరేకిస్తున్నారు.