Income Tax: ఇన్ కం టాక్స్ (ఐటీ) ఫైల్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే..

ఆదాయం, పెట్టుబడులను ప్రతీ ఏటా ప్రభుత్వానికి చూపించేందుకు ప్రతీ ఏటా ఐటీ ఫైల్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్ నుంచి మినహాయింపు రావడానికి కొన్ని ఖర్చులు చూపించుకోవచ్చు. ఉదాహరణకు ఇన్సూరెన్స్ ప్రీమియంలు, హోం లోన్స్, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ తో పాటు స్కూల్, కళాశాల పేమెంట్స్ ను ఖర్చుల్లో చూపించుకోవచ్చు. వీటి వల్ల ఐటీ రిటర్న్స్ సదుపాయం ఉంటుంది. అయితే ఇవి నమోదు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

Written By: Chai Muchhata, Updated On : July 11, 2023 9:36 am

Income Tax

Follow us on

Income Tax: వ్యక్తులు తమకు పరిమితికి మించి ఆదాయం ఉంటే ప్రభుత్వానికి పన్నును కట్టాల్సి ఉంటుంది. దీనినే ఇన్ కం ట్యాక్స్ (ఐటీ) అంటారు. అయితే తమ ఖర్చులను చూపిస్తూ ట్యాక్స్ నుంచి కొంత రిఫండ్ పొందవచ్చు. 2023 ఏడాదికి ఇన్ కం ట్యాక్ష్ గడువు జూలై 31. ఈ తేదీలోగా ఆదాయపు పన్నుకు సంబంధించిన ఫైల్ ను దాఖలు చేస్తే ఒకే. కానీ సమయం మించిపోతే మాత్రం ఫెనాల్టీ పడుతుంది. అయితే ఐటీ రిటర్న్ దాఖలు చేసేటప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అవగాహన రాహిత్యంతో ఐటీ దాఖలు చేస్తే మొదటికే మోసం అవుతుంది. ఐటీ దాఖలును నేరుగా వెబ్ సైట్ (www.incometax.gov.in) ద్వారా చెల్లించవచ్చు. లేదా సంబంధిత వ్యక్తుల సహాయంతో పూర్తి చేసుకోవాలి.

ఆదాయం, పెట్టుబడులను ప్రతీ ఏటా ప్రభుత్వానికి చూపించేందుకు ప్రతీ ఏటా ఐటీ ఫైల్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్ నుంచి మినహాయింపు రావడానికి కొన్ని ఖర్చులు చూపించుకోవచ్చు. ఉదాహరణకు ఇన్సూరెన్స్ ప్రీమియంలు, హోం లోన్స్, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ తో పాటు స్కూల్, కళాశాల పేమెంట్స్ ను ఖర్చుల్లో చూపించుకోవచ్చు. వీటి వల్ల ఐటీ రిటర్న్స్ సదుపాయం ఉంటుంది. అయితే ఇవి నమోదు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

కొత్తగా ఐటీ ఫైల్ చేసేవారు బ్యాంకు ఖాతా వివరాలను తప్పులు లేకుండా ఇవ్వాలి. ఇక్కడ మిస్టేక్ అయితే రీఫండ్ లో సమస్యలు ఎదురవుతాయి. కేంద్ర ప్రభుత్వం విధించి బడ్జెట్ ప్రకారం ఐటీని నమోదు చేయాల్సి ఉంటుంది. మీరు దేని పరిధిలోకి వస్తారో తెలుసుకున్న తరువాతే ఐటీ ఫాం నింపండి. ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేసిన 30 రోజుల్లో వెరిఫై చేయడం ముఖ్యం. ఒకవేళ అది ధ్రువీకరించకపోతే అది చెల్లనిదిగా పరిగణించబడుతుంది.

ఐటీ ఫైల్ దాఖలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్థిక వ్యవహారాల్లో దీనిని మెయిన్ ఫ్రూవ్ గా చూపించుకోవచ్చు. బ్యాంకు లోన్ కావాలనుకునేవారికి ఐటీ ఫైల్ మెయిన్ గా అవసరం ఉంటుంది. లోన్ ఇచ్చేవారు. తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్ ను తప్పనిసరిగా అడుగుతారు. ఉద్యోగ, వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్లేవారికీ ఐటీ రిటర్స్ కంపల్సరీ. ఇక ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకునేవారు ఐటీ దాఖలు చేసిన ధ్రువీకరణ పత్రా తప్పని సరి అని బీమా సంస్థలు డిమాండ్ చేస్తాయి. అయితే ఐటీ ఫైల్ ను గడువులోగా తీసుకొని ఫెనాల్టీ నుంచి తప్పించుకోండి.