
Summer Tourism : వేసవి కాలంలో పిల్లలకు సెలవులు వస్తాయి. దీంతో పలు ప్రాంతాలు పర్యటించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. కొందరేమో ఆధ్యాత్మిక ప్రాంతాలను ఎంచుకుంటారు. మరికొందరు టూరిజం స్పాట్లను కోరుకుంటారు. కశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు దేశంలో పర్యాటక ప్రాంతాలకు కొదవే లేదు. ఈ నేపథ్యంలో ఎవరి ఇష్టం ప్రకారం వారు తమ ప్రాంతాలను ఎంచుకోవడం సహజమే.

ఆధ్యాత్మిక కేంద్రాలు
దేశంలో ఆధ్యాత్మిక ప్రాంతాలు చాలా ఉన్నాయి. చార్ ధామ్, అక్షర ధామ్, కాశీతో పాటు చాలా ప్రాంతాలు మనదేశంలో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మనం సందర్శించాలనుకుంటే చాలా దేవాలయాలు మనకు కనిపిస్తాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తే పుణ్యంతో పాటు మానసిక సంతోషం కూడా కలుగుతుంది. కశ్మీర్ నుంచి చాలా దేవాలయాలు మనకు ప్రతిష్టాత్మకమైనవి ఉన్నాయి.
టూరిజం ప్రాంతాలు
ఆధ్యాత్మిక ప్రాంతాలే కాకుండా టూరిజం ప్రాంతాలు కూడా ఉన్నాయి. వేసవిలో మనం సందర్శించే ప్రాంతాల్లో దూరంగా ఉన్న వాటిని సందర్శించాలంటే ఖర్చులు పెరుగుతాయి. విమాన చార్జీలు, హోటల్ ఖర్చులు ప్రస్తుత కాలంలో బాగా పెరిగాయి. దీంతో దూర ప్రాంతాలు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. మన దగ్గర ఉన్న వాటిని సందర్శించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే నాగార్జున సాగర్, శ్రీశైలం, వైజాగ్ లాంటి ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు.
ఖర్చుకు భయపడి..
టూరిజం ప్రాంతాలను సందర్శించాలంటే ఖర్చు పెరుగుతోంది. గోవా సందర్శనకు వెళ్లాలంటే విమాన ఖర్చులు తడిసి మోపెడతాయి. అందుకే అక్కడకు వెళ్లడానికి భయపడుతున్నారు. దీనికి తోడు ఇప్పుడు కరోనా ప్రభావం మళ్లీ పెరగడంతో జంకుతున్నారు. దూర ప్రాంతాలు కాకుండా దగ్గర వాటిని ఎంచుకోవడం ఉత్తమంగా భావిస్తున్నారు. ఇలా వేసవిలో ప్లాన్ చేసుకుని మరీ టూరిజం కోసం వెళ్లడం సహజమే. కశ్మీర్ వెళ్లాలంటే ఖర్చుతో కూడుకుంటుంది. అదే లోకల్ గా ఉన్నవయితే ఖర్చు తగ్గుతుందని అంచనా వేసుకుంటారు. ఇలా మన సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు ఏదో ఒక ప్రాంతం ఎంచుకుని వెళ్లడం వల్ల మంచి అనుభూతి కలుగుతుంది.
కశ్మీర్ నుంచి..
కశ్మీర్ లో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉంటాయి. టూరిజం స్పాట్ అంటే కశ్మీర్, గోవా, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడకు వెళితే భూతల స్వర్గంలా అనిపిస్తుంది. అందుకే చాలా మంది పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే ఉత్తరాదికి వెళ్తుంటారు. అక్కడ కనిపించే సుందర ప్రాంతాలను చూసి కనువిందు చేసుకుంటారు.