Important Vastu Tips: ఒక్కోసారి మనం ఎంత డబ్బు సంపాదించినా ఐస్ గడ్డల కరిగిపోతూ ఉంటుంది. ఎన్ని మంచి పనులు చేసినా ఇంట్లో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారం రీత్యా నిత్యం ఒత్తిడితో ఉండాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలకు ఏవేవో కారణాలు చెబుతూ ఉంటారు. కానీ ఇంట్లో ఉండే వాస్తును కూడా పరిగణలోకి తీసుకోవాలని కొందరు పండితులు చెబుతుంటారు. ఇల్లు వాస్తు ప్రకారం గా లేకపోతే ఇంట్లో అనేక రకాల సమస్యలు విజృంభిస్తాయని అంటున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఇల్లు ఉన్నవారు కొన్ని రకాల వాస్తు టిప్స్ పాటించాలని పేర్కొంటున్నారు. మరి వీరి కోసం ఎలాంటి టిప్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ప్రతి ఇంటిలో బీరువా ఉండడం తప్పనిసరిగా మారింది. ఇందులో దుస్తులను భద్రపరుచుకుంటూ ఉంటారు. వీటితోపాటు డబ్బులు కూడా ఇందులోనే దాచుకుంటారు. ఇలా నిత్యం డబ్బు ఉండే బీరువాను వాస్తు ప్రకారం గా ఉంచుకోవాలి. బీరువా వాస్తు ప్రకారం లేకపోతే ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. ప్రతి ఇంటిలో దక్షిణం లేదా పడమర గోడవైపు బీరువాను ఆ నుంచి ఉంచాలి. బీరువా డోరు ఉత్తరం వైపు లేదా తూర్పు వైపు కలిగి ఉండాలి. ఇలా ఉంటే లక్ష్మీ దేవత ఇంట్లో కొలువై ఉంటుందని వాస్తు నిపుణులు తెలుపుతున్నారు.
కొందరు బెడ్ రూమ్ లో పడక మంచాలను ఇష్టం వచ్చినట్లు వేస్తారు. అయితే అలా వేయడం వల్ల ఇంట్లో వారికి నిత్యం అనారోగ్యం ఉంటుంది. బెట్ మంచాలను దక్షిణం నుంచి ఉత్తరం వైపు.. పడుకునేలా ఏర్పాటు చేసుకోవాలి. అంటే దక్షిణం వైపు తల ఉంచి ఉత్తరం వైపు కాళ్లు ఉండేలా నిద్రించాలి. ఇలా చేస్తే నాణ్యమైన నిద్ర పడుతుంది. దీనికి వ్యతిరేకంగా బెదిరిస్తే త్వరగా మరణం సంభవించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
ప్రతి ఇంట్లో ఈశాన్యం మూలం చాలా ప్రధానమైనది అని చెప్తూ ఉంటారు. ఈ ప్రదేశాల్లో దేవతలు కొలువై ఉంటారని అంటారు. అందువల్ల ఈశాన్యం లో ఎప్పటికీ శుభ్రంగా ఉంచుకోవాలి. అవసరమైతే గంగాజలంతో కలిపి దీపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు గంగాజలం చల్లినా కూడా ఇంట్లో స్వచ్ఛమైన వాతావరణ ఉంటుంది. ఇంట్లో అనుకున్న దానికంటే ఎక్కువగా డబ్బు రావాలని అనుకున్న వారు.. తూర్పు వైపు కూర్చొని భోజనం చేయాలి. అలా చేయడం వల్ల సూర్యుడి అనుగ్రహం ఉండి ఇంట్లో సిరిసంపదలు వెళ్లి విరిస్తాయని అంటున్నారు. చాలామంది ఉదయం లేవగానే దేవుడి ఫోటోలు, లేదా ఇతరుల మొహాలను చూస్తూ ఉంటారు. అలాకాకుండా ప్రతిరోజు ఉదయం లేవగానే ఎవరి అరిచేతులు వారే చూసుకోవడం వల్ల అదృష్టం భరిస్తుందని అంటున్నారు. లక్ష్మీ కటాక్షం కావాలని అనుకునేవారు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తులసి చెట్టు వద్ద నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేస్తే అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని చెబుతున్నారు.