Chanakya Niti On Success: మనిషి జీవితంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. తన మేధస్సుతో ఎన్నో కొత్త విషయాలు కనుక్కొంటున్నాడు. ఆధునిక కాలంలో అయినా పూర్వ కాలంలో అయినా మనిషి తెలివితో వ్యవహరించి తన సమస్యలను దూరం చేసుకుంటున్నాడు. తన బాధలను తీర్చుకుంటున్నాడు. ఫలితంగా జీవితంలో ఉన్నత స్థానాలు అధిరోహిస్తున్నాడు. ఇదంతా మనిషిలోని తెలివితేటలు, బుద్ధికుశలతతోనే సాధ్యమవుతున్నాయి. ఆంగ్లంలో ఓ సామెత ఉంది. ఎ స్మాల్ కీ ఓపెన్ ద బిగ్ డోర్ చిన్న తాళం చెవి ఓ పెద్ద తలుపును తెరుస్తుంది. అలాగే మనిషి సమస్యలకు సావధానంగా ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది. తద్వారా తన కష్టాలను దూరం చేసుకోవచ్చు. అంతే కాని ఏదో జరిగిందని గాబరా పడకుండా మనసు పెట్టి ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగా మారిపోవడం ఖాయం.

ఆచార్య చాణక్యుడు మనిషి జీవితంలో ఎదగడానికి ఉండే లక్షణాలను వివరించాడు. తన రాజనీతి శాస్త్రం ద్వారా ఆనాడే మనిషి ఉన్నత శిఖరాలు చేరుకోవాలంటే సమస్యలతో సతమతమవడానికి వీల్లేదు. వాటిని తృణప్రాయంగా భావించి మన దారిని సుగమం చేసుకోవాలి అని చెప్పాడు. ప్రతి మనిషికి ధైర్యం ఒక కవచంలా పనిచేస్తుంది. ఎంతటి ఆపద వచ్చినా ధైర్యంతో ఉన్నవాడిని ఏం చేయదు. అతడి ధైర్యమే అతడికి అండగా నిలుస్తుంది. సమస్యను చూసి భయపడితే చెట్టే చుట్టూరా దెయ్యమై భయపెడుతుంది. గుండెంటూ కలిగి ఉంటే అదే నీ వెంట సైన్యమై నిలుస్తుంది.
Also Read: Puri Jagannath : పూరి జగన్నాథ్.. ఆడు మగాడ్రా బుజ్జీ!
మనిషికి ఏకాగ్రత కూడా తోడుగా నిలుస్తుంది. ఏకాగ్రత ఉన్న వ్యక్తులు ప్రతి విషయాన్ని తార్కికంగా ఆలోచిస్తుంటారు. దేన్ని కూడా గుడ్డిగా నమ్మరు. ఎంతటి ఉపద్రవాన్ని అయినా ఇట్టే ఎదుర్కొంటారు. ఎంతటి సమస్యనైనా ఇట్టే పరిష్కరిస్తారు. అందుకే ఏకాగ్రత మనకు ఓ ఆభరణంలా ఉండాల్సిందే. దీంతోనే మనకు బుద్ధి కుశలత పెరుగుతుంది. ఆలోచన సంపత్తి ఎక్కువవుతుంది. తద్వారా సమస్యలు మన దరికి చేరవు. ఒకవేళ చేరినా పరిష్కరించుకునే సత్తా మన దగ్గర ఉండటంతో ఎలాంటి బాధలు అక్కర్లేదు.

మనకు పెద్దల పట్ల గౌరవం ఉండాలి. చిన్నవారి పట్ల ప్రేమ ఉండాలి. లేకపోతే భవిష్యత్ తరాలు మనల్ని గుర్తించవు. మనం ఇప్పుడు పెద్దలను గౌరవించకపోతే రాబోయే కాలంలో చిన్న వారు మనల్ని చులకనగా చూసే ప్రమాదం ఉంది. అందుకే మనం పెద్దలను గౌరవించి చిన్నవారికి దారి చూపాలి. చిన్నవారికి ఎలాంటి కష్టమొచ్చినా మంచి సలహాలు ఇస్తే వారు మన మీద అభిమానం చూపుతారు. మనకెందుకులే అనే భావం తొలగించుకోండి. చిన్నవారితో ప్రేమగా మెలగండి. వారు కూడా మిమ్మల్ని అంతే ప్రేమతో చూస్తారు.
మనిషి జీవితంలో ఎదిగేందుకు ఆచార్య చాణక్యుడు ఎన్నో విషయాలు చెప్పాడు. మనం వాటిని పాటిస్తే సరిపోతుంది. జీవితంలో మంచి పొజిషన్ లో ఉండేందుకు అందరు కష్టపడాల్సిందే. ఎవరు కూడా కష్టపడకుండా మంచి పొజిషన్ కు వెళ్లరని గుర్తుంచుకోవాలి. అందుకే కష్టాన్ని నమ్ముకుని మనం జీవితంలో మంచి స్థానం సంపాదించుకోవాలని చూడాలని ఆచార్య చాణక్యుడు తన గ్రంథంలో వివరించాడు.
Also Read:Liger Story Leaked: లీక్ అయిన లైగర్ కథ.. ఇటు బిజినెస్ లోనూ విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డు !