Taapsee Pannu: తెలుగు తెర పై పూసిన సొట్టబుగ్గల మందారం ‘తాప్సీ’. ఆమె ఏం మాట్లాడినా సంచలనమే. ఆమె మాటలే కాదు, ఈ బ్యూటీ సినీ జర్నీ కూడా సంచలనమే. తెలుగులో సక్సెస్ రాకముందే తమిళంకి అటు నుండి హిందీకి పరవళ్లు తొక్కింది. పైగా తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ సాధించిన హీరోయిన్ గా తాప్సీ బాలీవుడ్ లో తనను తానూ బాగా ప్రమోట్ చేసుకుంది. తన ప్రమోషన్ కోసం కొన్ని సార్లు బోల్డ్ కామెంట్స్ కూడా చేసింది.

తాజాగా ప్రేక్షకుల అభిరుచి పై క్రేజీ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ఆమె మాటల్లోనే విందాం. ‘ఏ సినిమా చూడాలో చూడొద్దో ప్రేక్షకులకి తెలుసు. ఫలానా సినిమాలని బాయ్ కాట్ చేయండి అని చెప్పడం ప్రేక్షకుల మేధస్సును కించపరచడమే అవుతుంది. అసలు ఏ సినిమాని చూడాలి ?, ఏ సినిమాని చూడకూడదు అనే విచక్షణ ప్రేక్షకులకు ఉంది. సినిమా బాగుంటే వాళ్ళు వస్తారు, లేకపోతే లేదు.
దీనికి ఎందుకు ?, సినిమాని బాయ్ కాట్ చేయండని చెప్పడం ?, నాకైతే సినిమాలని బాయ్ కాట్ చేయడం అనేది పెద్ద జోక్ లాగా అనిపిస్తుంది. నేను ఇలాంటి ట్రోల్స్ ని పట్టించుకోవడం ఎప్పుడో మానివేశాను” అని తాప్సీ సంచలన కామెంట్స్ చేసింది. మొత్తానికి తాప్సీ ఎప్పటికప్పుడు బోల్డ్ కామెంట్స్ చేస్తూ వార్తలకెక్కుతూనే ఉంది.
‘తాప్సీ గ్లామర్ విషయానికి వస్తే.. ఆకర్షణీయమైన మేని ఛాయ ఉన్న ‘తాప్సీ పన్ను’ అందం వెనుక ఉన్న సీక్రెట్ తెలుసుకోవాలని ఉందా ? అసలు, తన అందం కాపాడుకోవడం కోసం ‘తాప్సీ పన్ను’ ఏమి చేస్తోంది ? మరి, తన చర్మ సంరక్షణ కోసం తాప్సీ పాటించే బ్యూటీ సీక్రెట్స్ ఏమిటి ? అలాగే ఆమె ఫాలో అయ్యే బ్యూటీ టిప్స్ ఏమిటో చూద్దాం.

డైట్ :
‘తాప్సీ పన్ను’ లిమిటెడ్ నాన్ వెజిటేరియన్ డైట్ ను ఫాలో అవుతుంది. అలాగే ‘తాప్సీ’కి పప్పు అంటే చాలా ఇష్టం, తన భోజనంలో ఎప్పుడూ పప్పు ఉండేలా చూసుకుంటుంది. తన అందమైన శరీర సౌష్టవాన్ని కాపాడుకోవడం కోసం, ఆమె ఎక్కువగా ఆకుకూరలు, పెరుగుతో చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకుంటుంది.
‘తాప్సీ’ తన సుకుమారమైన చర్మం కోసం ఏమి చేస్తోంది అంటే :
‘తాప్సీ’ తన రొటీన్‌లో ముఖం, చర్మంతో పాటు మొత్తం శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ‘తాప్సీ’ బయట దొరికే మేకప్ రసాయనాలు, వివిధ మార్కెట్ ఉత్పత్తులకు బదులుగా ఇంట్లో చర్మ సంరక్షణను ఇష్టపడుతుంది. మెయిన్ గా బేసన్ (Besan) ఫ్రెష్ క్రీమ్ తో తయారు చేసిన ప్యాక్ ను ‘తాప్సీ’ ఎక్కువగా తన ఫేస్ కి అప్లై చేస్తుంది. ఈ ప్యాక్ స్క్రబ్ లాగా బాగా పనిచేస్తుందని ‘తాప్సీ’ అందానికే ఇదే మెయిన్ సీక్రెట్ అని ఆమె చెబుతుంది.
‘తాప్సీ’ ఈ ప్యాక్ ను ఎలా తయారు చేస్తోంది అంటే ?
ముందుగా ఆమె ఒక శుభ్రమైన గ్లాస్ బౌల్ తీసుకుని.. అందులో ఒక టేబుల్ స్పూన్ బేసన్, ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుతుంది. ఆ మిశ్రమాన్ని సన్నని పేస్ట్‌తో కాకుండా మందపాటి పేస్ట్ లాగా తయారు చేసి ‘తాప్సీ’ దాన్ని ఉపయోగిస్తోంది.
Also Read: Prabhas Marriage: ప్రభాస్ ని పెళ్లంటే భయపడేలా చేసిన ఓ అమ్మాయి మోసం… తల్లి బయటపెట్టిన షాకింగ్ రీజన్!