PPF: పీపీఎఫ్ లో చేరితే పొందే లాభాలు ఇవే.. తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే?

PPF: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేసేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు లోన్ ను పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు రుణ సదుపాయం కల్పిస్తుంది. పీపీఎఫ్ అకౌంట్ ను ఓపెన్ చేసిన ఏడు సంవత్సరాల నుంచి ఈ […]

Written By: Navya, Updated On : December 17, 2021 6:23 pm
Follow us on

PPF: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేసేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు లోన్ ను పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు రుణ సదుపాయం కల్పిస్తుంది. పీపీఎఫ్ అకౌంట్ ను ఓపెన్ చేసిన ఏడు సంవత్సరాల నుంచి ఈ బెనిఫిట్ ను పొందవచ్చు.

PPF

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కు సంబంధించి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుండగా కేంద్ర ప్రభుత్వం మూడు నెలలకు ఒకసారి వడ్డీరేట్లలో మార్పులు చేస్తుంది. వడ్డీరేట్లు మూడు నెలలకు ఒకసారి పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు కాగా స్కీమ్ టెన్యూర్ ను పొడిగించుకునే అవకాశం అయితే ఉంటుంది.

Also Read: అమ్మకానికి మరో ప్రముఖ హాస్పిటల్స్ గ్రూప్.. డీల్ విలువ ఎంతంటే?

మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకున్న సమయంలో కంట్రిబ్యూషన్ ను కొనసాగించడం లేదా ఆగిపోవడం చేయవచ్చు. 500 రూపాయల నుంచి లక్షన్నర రూపాయల వరకు ఎంత మొత్తమైనా ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు. అయితే మినిమం బ్యాలెన్స్ చెల్లించని పక్షంలో అకౌంట్ పని చేయదని గుర్తుంచుకోవాలి. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 5వ తేదీలోపు డబ్బులను డిపాజిట్ చేస్తే మంచిది.

మెచ్యూరిటీ సమయం వచ్చిన తర్వాతే డబ్బులను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. స్కీమ్ లో చేరిన వ్యక్తి మరణించిన పక్షంలో అకౌంట్ ను ముందుగానే క్లోజ్ చేస్తారు. అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ పై 25 శాతం రుణంగా తీసుకోవచ్చు.

Also Read: పాడి పరిశ్రమ కోసం స్టార్టప్ పోటీలు.. గెలిచిన వారికి ఏకంగా రూ.10 లక్షలు?