Best Mileage Cars: ఇటీవల కాలంలో జీవన శైలి మారుతోంది. ఒకప్పుడు సైకిల్ ఉండటమే గొప్ప. ఇప్పుడు ప్రతి ఇంటిలో ద్విచక్రవాహనాలు రెండు మూడు ఉంటున్నాయి. రాబోయే కాలంలో కార్లదే హవా. అందుకే ప్రస్తుతం కారు ఉంటేనే అదో దర్జాగా చూస్తున్నారు. దీంతో కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. ప్రతి వారు కారులో షికారు చేయాలని కోరుకుంటుంటారు. దీనికి అనుగుణంగా ఓ మంచి కారు కొనుక్కోవాలని భావిస్తుంటారు. దీంతో కార్ల కంపెనీలు పలు మోడళ్లలో కార్లు ఉత్పత్తి చేస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించే క్రమంలో కొత్త నమూనాల్లో రూపకల్పన చేస్తున్నాయి. దీంతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ప్రస్తుతం అతితక్కువ ధరలో లభ్యమయ్యే కార్లలో మారుతి సుజుకి కంపెనీకి చెందిన ఆల్టో 800 కారు అత్యంత ప్రజాదరణ పొందుతోంది. ధర తక్కువ మన్నిక ఎక్కువ అనే నినాదంతో మంచి డిమాండ్ పలుకుతోంది. ప్రారంభ ధర రూ.3.99 లక్షల నుంచి అనతికాలంలోనే ఎక్కువ అమ్మకాలు సాధించింది. ఆధునిక డిజైన్, అప్ డేట్ ఫీర్స్ తో వినియోగదారులకు ఇష్టమైన కారుగా కనిపిస్తోంది. లీటర్ కు 24 కిలోమీటర్ల మైలేజ్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

వినియోగదారులకు విశ్వాసమైన కారుగా మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఉంటోంది. ఇది చూడటానికి అద్భుతమైన డిజైన్ కలిగి ఉండటంతో వినియోగదారులు ఎక్కువగా ఇష్టడుతున్నారు. కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. దీని ధర రూ.4.25 లక్షలుగా ఉంది. దీంతో మంచి మైలేజ్ ఇస్తుంది. ప్రయాణానికి అనువుగా ఉండటంతో వినియోగదారులు దీన్ని కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో దీనికి డిమాండ్ బాగానే ఉంటోంది.

మరో కారు టాటా టియాగో కూడా వినియోగదారులను మంత్రముగ్దులను చేస్తోంది. దేశీయ వాహన తయారీ సంస్థ అయిన టాటా ఎన్నో రకాల వ్యాపారాలు కలిగి ఉన్నా అన్నింట్లోనే నాణ్యతకు పెద్దపీట వేస్తోంది. అందుకే కార్ల ఉత్పత్తిలో కూడా కొత్తదనం ఉండేలా చూసుకుంటోంది. అందుకే వినియోగదారులకు విశ్వాసవంతంగా ఉంటోంది. దీని ధర కాస్త ఎక్కువైనా కారు తీరు మాత్రం ఆకర్షణీయంగానే ఉంటోంది. దీంతో వినియోగదారుల మనసు దోచుకుంటోంది. దీని ధర రూ.5.39 లక్షలుగా ఉంది.

మరో అద్భుతమైన కారు రెనాల్డ్ క్విడ్. చూడటానికి చిన్నగా ఉన్నా పనితీరు, ఫీచర్స్ లో ఆకట్టుకుంటోంది. మారుతి ఆల్టో తరువాత దీనికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీని ధర రూ.4 లక్షల పైనే ఉంటోంది. ఇందులో రెండు పెట్రోల్ ఇంజిన్లు ఉండటంతో దీన్ని సొంతం చేసుకోవాలని వినియోగదారులు ఎక్కువగా ఆశ పడుతున్నట్లు తెలుస్తోంది. మరో కంపెనీ మారుతి సెలెరియో కూడా మార్కెట్లో దూసుకుపోతోంది. తన అమ్మకాల్లో ఇతర కంపెనీలతో పోటీ పడుతోంది. మైలేజ్ తో పోటీపడి కంపెనీలు కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నాయి.
