https://oktelugu.com/

Zodiac Signs:  2022 లో ఈ నాలుగు రాశుల వారికి తిరుగు ఉందట .! మరి మీ రాశి ఇందులో ఉందేమో చుడండి ..!

Zodiac Signs:  జోతిష్య శాస్త్రాన్ని కొంతమంది నమ్మితే మరికొందరు మాత్రం అస్సలు నమ్మరు. జోతిష్య శాస్త్రంలో ప్రధానంగా గ్రహాల గురించి, రాశుల గురించి ప్రస్తావన ఉంటుంది. గ్రహాలు స్థానాలను మార్చుకోవడం వల్ల రాశులపై ప్రభావం పడుతుంది. ఈ ఏడాది చివరి వారంలో శుక్ర గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారనుంది. జోతిష్య పండితులు శుక్రుడు రాశిని మార్చుకోవడం వల్ల నాలుగు రాశుల వాళ్లకు రాబోయే రెండు నెలలు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. శుక్రుడి సంచారం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 25, 2021 / 03:23 PM IST
    Follow us on

    Zodiac Signs:  జోతిష్య శాస్త్రాన్ని కొంతమంది నమ్మితే మరికొందరు మాత్రం అస్సలు నమ్మరు. జోతిష్య శాస్త్రంలో ప్రధానంగా గ్రహాల గురించి, రాశుల గురించి ప్రస్తావన ఉంటుంది. గ్రహాలు స్థానాలను మార్చుకోవడం వల్ల రాశులపై ప్రభావం పడుతుంది. ఈ ఏడాది చివరి వారంలో శుక్ర గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారనుంది. జోతిష్య పండితులు శుక్రుడు రాశిని మార్చుకోవడం వల్ల నాలుగు రాశుల వాళ్లకు రాబోయే రెండు నెలలు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు.

    శుక్రుడి సంచారం వల్ల వృశ్చికరాశికి చెందిన వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్లకు డబ్బు ఆదా కావడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు శుభవార్తలు అందే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వాళ్లు కుటుంబ సభ్యుల మద్దతు పొందే అవకాశంతో పాటు కొత్త వ్యాపారాలను మొదలుపెట్టాలని భావించే వాళ్లకు అనుకూల సమయం అని చెప్పవచ్చు. వృశ్చిక రాశివాళ్లకు రాబోయే రెండు నెలల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది.

    కర్కాటక రాశివాళ్లకు సైతం శుక్ర గ్రహ సంచారం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఈ రాశివాళ్లకు శుక్రగ్రహ సంచారం వృత్తిపరమైన లాభాలను అందడంతో పాటు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వాళ్లకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న కర్కాటక రాశివాళ్లకు ఇది అనుకూల సమయమని చెప్పవచ్చు. వృషభరాశి వాళ్లకు సైతం శుక్రుడి సంచారం వల్ల మేలు జరుగుతుంది.

    సరైన ప్రణాళికతో వ్యవహరిస్తే వీళ్లు విజయం సాధించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులకు పదోన్నతులు లభించడంతో పాటు పాత బకాయిలు వసూలవుతాయి. రాబోయే రెండు నెలలు మేష రాశివాళ్లకు కూడా శుభప్రదమని చెప్పవచ్చు. ఈ రాశివాళ్లకు కష్టానికి తగిన ఫలితం దక్కడంతో పాటు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

    Also Read: కొత్త సంవత్సరంలో ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే ఇబ్బందులే!