https://oktelugu.com/

Niharika Konidela : సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన నిహారిక కొణిదెల..బన్నీ వల్లే నేను ఈరోజు అలా చేయాల్సి వచ్చింది అంటూ కామెంట్స్!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన వ్యవహారం దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది. ఈ ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కి ఇటీవలే రెగ్యులర్ బెయిల్ వచ్చింది, బెయిల్ వచ్చిన రెండు మూడు రోజుల తర్వాత ఆయన కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ని పరామర్శించేందుకు వెళ్ళాడు.

Written By:
  • Vicky
  • , Updated On : January 8, 2025 / 03:35 PM IST

    Niharika Konidela

    Follow us on

    Niharika Konidela : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన వ్యవహారం దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది. ఈ ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కి ఇటీవలే రెగ్యులర్ బెయిల్ వచ్చింది, బెయిల్ వచ్చిన రెండు మూడు రోజుల తర్వాత ఆయన కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ని పరామర్శించేందుకు వెళ్ళాడు. అనంతరం అతని తండ్రి భార్గవ్ తో మాట్లాడుతూ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను ముందు ఉన్నాను అంటూ భరోసా కల్పించాడు. అంతకు ముందు అల్లు అర్జున్ తన పుష్ప టీం తో కలిసి శ్రీ తేజ్ కుటుంబానికి రెండు కోట్ల రూపాయిల ఆర్ధిక సాయం అందించాడు. సినీ ప్రముఖులు పలువురు కూడా శ్రీతేజ్ ని కలిశారు. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై స్పందించడం మనమంతా చూసాము. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి నిహారిక కొణిదెల కూడా ఈ విషయంపై స్పందించింది.

    ఆమె మాట్లాడుతూ ‘రేవతి గారు తొక్కిసలాట ఘటనలో చనిపోయారు అనే వార్తని చూసిన తర్వాత నా గుండె ముక్కలైంది. అల్లు అర్జున్ గారు చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఎవ్వరూ ఇలాంటి ఘటనలు కావాలని జరగాలని కోరుకోరు. మన దురదృష్టం కొద్దీ జరుగుతూ ఉంటాయి. తన వల్ల పరోక్షంగా ఒక ప్రాణం కోల్పోయింది అని అల్లు అర్జున్ గారిలో చాలా బాధ ఉంది. ఇప్పుడిప్పుడే ఆయన కుటుంబ సభ్యులు, అభిమానుల ఆధారాభిమానులు కారణంగా ఆ బాధ నుండి నెమ్మదిగా కోలుకుంటున్నాడు’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు ఇంట్లో అందరికీ కంటి మీద కునుకు రాలేదని, మా నాన్న నాగబాబు గారు చాలా టెన్షన్ పడ్డారు అంటూ ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది.

    ఇకపోతే నిహారిక తన మొదటి సినిమాతో హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసి, ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా కొనసాగి, అవి ఏమాత్రం ఆమెకి సక్సెస్లను ఇవ్వకపోవడంతో నటనకు గుడ్ బై చెప్పి నిర్మాతగా మారిపోయిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆమె ‘కమిటీ కుర్రాళ్ళు’ అనే చిత్రాన్ని నిర్మించి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని, బోలెడంత లాభాలను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఆమె తమిళం లో ‘మద్రాస్ కారన్’ అనే చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ నేపథ్యంలో ఆమె వరుసగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నది. అందులో భాగంగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో అల్లు అర్జున్ ప్రస్తావన రాగా, పై విధంగా స్పందించింది. ఆమె స్పందించిన తీరుకి అల్లు అర్జున్ అభిమానుల నుండి సోషల్ మీడియా లో మంచి రెస్పాన్స్ వచ్చింది.