TVS: బైకులను మార్కెట్లోకి తీసుకు రావడంలో TVS కంపెనీ దిట్ట అని చెప్పవచ్చు. ఎన్నో ఏళ్లుగా ద్విచక్రవాహనాలను వినియోగదారులకు తక్కువ ధరలోనే అందించి వారి మన్ననలను పొందింది. అయితే ఇటీవల జరిగిన Auto Expoలో టీవీఎస్ కొత్త బైక్ ను ప్రదర్శించింది. కంప్టీట్ గా యూత్ ను ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ బైక్ ను చూసి వావ్ అని అంటున్నారు. డిఫరెంట్ డిజైన్ తో ఉన్న దీని లుక్ అదరహో అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. దీనికి RTS X Concept పేరు పెట్టారు. ఇది 300 సీసీ ఇంజిన్ తో పనిచేస్తుందని తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఈ బైక్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
RTS X Concept బైక్ 310 ప్లాట్ ఫాం ఆధారంగా పని చేస్తుంది. దీని లుక్ కొత్తగా ఉంది. ఫ్రంట్ సైడ్ లో షార్డ్ హెడ్ లైట్ ను అమర్చారు. మడిగడ్ కు రగ్డ్ లుక్ ను అందించారు. పూర్తిగా పొడవాటి సీటుతో ఉన్న ఈ బైక్ మినిమలిస్టిక్ స్టైలింగ్ లుక్ తో కనిపిస్తుంది. అలాగే టెయిల్ సెక్షన్ సబ్ ప్రేమ్ తో కనిపిస్తుంది. ఇది పూర్తిగా వైట్ తో పాటు ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంటుంది. స్టైలింగ్ గా బైక్ నడపాలని అనుకునేవారికి ఇది బాగా నచ్చుతుంది.
ఈ బైక్ లో 299 సీసీ ఇంజిన్ ను అమర్చారు. సింగిల్ సిలిడర్ తో పాటు లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను చేర్చారు. ఇది పూర్తిగా 35 బీహెచ్ పీ పవర్ తో పాటు 28.5 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. అలాగే క్విక్ పిప్టర్ లుక్ లో ఉన్న ఈ బైక్ 6.3 సెక్షన్ లో 0 నుంచి 100 కిలోమీటరల్ వేగంతో పనిచేస్తుంది. మొత్తంగా ఈ బైక్ 144 కిలోల బరువు ఉంటుంది. ఎక్కువగా హైట్ తో కనిపించే ఇది 875 మిల్లిమీటర్లు ఉండే దీనికి రెండు వైపులా 17 అంగుళాల వీల్స్ ను కలిగి ఉన్నాయి. అలాగే ముందు వైపు 43 మిల్లీమీటర్ల యూఎస్ డీ ఫోర్క్, వెనుకవైపు మోనోషాక్ ను అమర్చారు.
ఆర్టీఎస్ ఎక్స్ కాన్సెప్ట్ బైక్ ఆకట్టుకునగలిగితే దీని తరువాత మరో బైక్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ప్రస్తుతం దీని డిజైన్ ను చూసి ఆకర్షితులవుతున్నారు. టీవీఎస్ బైక్ అంటే చాలా తక్కువ ధరకు వస్తుందని చాలా మంది భావన. అయితే ప్రీమియం లుక్ లో ఉన్న ఈ బైక్ ఎంత ధర పలుకుతుందో చూడాలి. అయితే ఈ బైక్ లుక్ చూస్తే మాత్రం కచ్చితంగా భారీగానే ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా లేటేస్ట్ గా వచ్చే బైక్ లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.