Migraine: కొందరు తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతుంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు వచ్చే నొప్పిని తట్టుకోవడం చాలా కష్టం. అయితే చాలా మంది ఈ నొప్పిని తట్టుకోలేక మందులు వాడుతుంటారు. ఎప్పుడో ఒకసారి వీటికి మందులు వాడటం మంచిదే. కానీ అధికంగా వాడితే వాటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది మైగ్రేన్ నొప్పితో బాధపడుతున్నారు. అలాంటి వారు ఉపశమనం పొందడానికి ఓ పరికరాన్ని అహ్మదాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌లు తయారు చేశారు. ఆ పరికరంతో కేవలం కొన్ని నిమిషాల్లోనే తలనొప్పి, మైగ్రేన్ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ పరికరం ఏంటి? దీని పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో యువత ఎక్కువగా సుఖానికి అలవాటు పడ్డారు. దీంతో వండుకుని తినే సమయం కూడా లేకపోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మైగ్రేన్ వంటి సమస్యలతో కూడా యువత బాధపడుతోంది. గంటల తరబడి మొబైల్ వాడటం వంటి సమస్యల వల్ల చాలా మందికి ఈ సమస్య వస్తోంది. వీటిని నివారించడానికి మందులు వాడితే.. అవి తర్వాత మూత్రపిండాలు, కాలేయం వంటి సమస్యలను ప్రభావితం చేస్తుంది. దీని కోసం అహ్మదాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌లు సెరెబ్రే: ది మైగ్రేన్ క్యూరింగ్ డివైస్‌ను తయారు చేశారు. ఈ పరికరం తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. సాధారణ బెల్ట్ లాగా.. ఉంటుంది. టార్గెటెడ్ వైబ్రేషన్ థెరపీ ద్వారా మైగ్రేన్ ఉపశమనం అందించడానికి ప్రత్యేకంగా రూపొందించారు.
తలపై వివిధ మైగ్రేన్ మచ్చలపై పని చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 50 Hz నుంచి 150 Hz వరకు మెత్తగా ట్యూన్ చేస్తారు. ఇది వైబ్రేషన్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా తలనొప్పి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరికరం వల్ల ఈజీగా తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యల తగ్గుతాయి. ఈ పరికరం వల్ల జ్ఞాపకశక్తి కూడా బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు. బలహీనంగా ఉన్న లేదా మనస్సు ఒకే చోట స్థిరంగా ఉండని పిల్లలకు కూడా ఈ పరికరం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పరికరంలో ఒక మోటారు అమర్చుతారు. ఇది మైగ్రేన్‌కి వ్యతిరేక దిశలో ఫ్రీక్వెన్సీ శక్తిని ఇవ్వడం వల్ల నొప్పి తగ్గుతుంది. ఈ పరికరాన్ని ఇలా ఉపయోగిస్తే ఒక 20 నుంచి 30 నిమిషాల్లో మైగ్రేన్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లు కూడా ఉండవు. ఈ పరికరాన్ని దాదాపు 150 మందిపై పరీక్షించగా విజయవంతం అయ్యారు. ఈ పరికరాన్ని తయారు చేయడానికి దాదాపు రెండు నెలలు సమయం పట్టింది.