
Beers : తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరు ఎక్కువగానే ఉంటుంది. ప్రతి పండుగ, సీజన్ లలో మద్యం అమ్మకాల ప్రభావం అధికంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగానే వస్తోంది. కోట్లాది రూపాయల మద్యం తాగేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి ఢోకా లేకుండా పోతోంది. ఆదాయం ఎక్కువగా రావడంతో రాష్ట్ర ఖజానా నిండుతోంది.
వేసవి కాలంలో అయితే మద్యం అమ్మకాలు జోరుగా మారుతాయి. ఎండ బారి నుంచి రక్షించుకునే క్రమంలో అందరు బీర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో బీర్లు అధికంగా తాగుతున్నారు. దీని వల్ల మద్యం ప్రియులు తమ నాలుకలను తడుపుకుంటున్నారు. ఒక ఏప్రిల్ నెలలోనే కోటి విలువైన మద్యం తాగారంటే మద్యం ఎంత రేంజ్ లో అమ్ముడుపోతోందో తెలుస్తోంది.

17 రోజుల్లోనే ఇంత భారీ స్థాయిలో బీర్లు తాగారు. దీంతో మద్యం ప్రియులు ఎంత ఉత్సాహం చూపిస్తున్నారో తెలుస్తోంది. ప్రభుత్వానికి ఆదాయం భారీగానే సమకూరుతోంది. గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లోనే 8,46,175 కేస్ ల బీర్లు అమ్ముడయ్యాయంటే పరిస్థితి తీవ్రత అర్థమైపోతోంది. రోజుకు సగటున ఆరు లక్షల బీర్లు అమ్ముడైనట్లు ఆధారాలు తెలియజేస్తున్నాయి. దీంతో మద్యం అమ్మకాల తీరు ఎంతటి ప్రాధాన్యం సంతరించుకుందో అర్థమవుతోంది.
మండే ఎండల ప్రభావంతోనే మద్యం అమ్మకాలు పెరిగినట్లు తెలుస్తోంది. పండుగల వేళ కూడా మద్యం భారీగానే అమ్ముడవుతుంది. ఈ క్రమంలో ఇప్పుడే ఇంత మద్యం తాగితే ఇంకా మేలో ఎంత తాగుతారో అర్థం కావడం లేదు. మధ్య తరగతి జీవితాలు మద్యంతోనే బుగ్గిపాలు అవుతున్నట్లు చెబుతున్నారు. ఏదేమైనా సర్కారుకు మాత్రం ఆదాయం రావడమే కావాలి. ఎవరి కొంప కొల్లేరైతే తమకేం అన్నట్లుగా వ్యవహరిస్తోంది.