Electric Vehicles: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను పెంచాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడం ద్వారా పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అయితే ప్రముఖ కంపెనీలలో ఒకటైన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ కొత్త స్కీమ్ తో ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఎవరైతే కొత్తగా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేస్తారో వాళ్లకు 3 లక్షల రూపాయల వరకు ప్రోత్సాహకాలను ఇవ్వనుంది.

వచ్చే ఏడాది జనవరి నుంచి తమ కంపెనీ ఉద్యోగులకు ఈ ప్రయోజనాలను అందిస్తామని కంపెనీ వెల్లడించింది. దేశంలో ఉన్న తమ కంపెనీ ఉద్యోగుల కోసం ఈ సంస్థ గ్రీన్ ఇనీషియేటివ్ ను లాంఛ్ చేసింది. 2022 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి దేశంలో ఉన్న తమ కంపెనీ ఉద్యోగులందరికీ ఈ పాలసీ వర్తిస్తుందని సంస్థ తెలిపింది. నూతన పాలసీ ప్రకారం కారు లేదా బైక్ ను కొనుగోలు చేసిన వాళ్లు 3 లక్షల రూపాయల వరకు బెనిఫిట్స్ ను పొందవచ్చు.
Also Read: ఈ ఏడాది ఫస్ట్ డే.. అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలివే..
ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను ప్రోత్సహించడమే ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశమని సంస్థ వెల్లడించింది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను కొనుగోలు చేసిన వాళ్లకు సంస్థ ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. ఈ కంపెనీకి సంబంధించిన అన్ని ఆఫీసులలో, ప్లాంట్లలలో కార్ల్ కొరకు ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్లను, పార్కింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. మన దేశాన్ని నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ స్థాయికి తెస్తామని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
జేఎస్‌డబ్ల్యూ సంస్థ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ ఈ విషయాలను వెల్లడించారు. ఈ విధంగా చేయడం ద్వారా ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను ప్రోత్సహించవచ్చని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read: న్యూఇయర్ పై ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఆంక్షల మధ్యే సెలబ్రెషన్స్..!