Colorful lakes : అతిపెద్ద మంచినీటి చెరువుగా పేరొందిన ఎన్నో సరస్సులు మన దేశంలో ఉన్నాయి. ఇక వేసవిలో విదేశీ విహంగాలు విడిదికి ఎక్కువ సంఖ్యలో రావడం కామన్. మిగతా రోజుల్లోనూ సరస్సులో ఎంతో కొంత సందడి కనిపిస్తూనే ఉంటుంది. ఈ సరస్సుల వద్దకు వచ్చే పక్షుల సందడిని తిలకించడానికి పర్యాటకులను ఆకర్షించేలా ప్రభుత్వాలు పథకాల నిధులతో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడుతుంటాయి. మరి ఇదంతా పక్కన పెడితే రంగరంగుల సరసుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
విలాసవంతమైన వెకేషన్ స్పాట్‌ల నుంచి దాచిన అద్భుతాల వరకు, ఈ గ్రహం కొన్ని అద్భుతమైన, రంగురంగుల సరస్సులకు నిలయంగా నిలిచింది. మన ప్రపంచంలో దాగిన కొన్ని రంగురంగుల సరస్సుల అందం విస్మయానికి గురి చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఇంతకీ ఆ సరస్సులు ఏవి అనుకుంటున్నారా? అయితే ప్రపంచంలోని ఐదు అత్యంత రంగుల సరస్సుల జాబితా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బొలీవియాలో ఉన్న లగునా కొలరాడా సరస్సు చాలా అందంగా ఉంటుంది. అద్భుతమైన ఎరుపు రంగు కారణంగా ప్రపంచంలోని అత్యంత రంగుల సరస్సులలో ఒకటిగా ఈ సరస్సు పేరు గాంచింది. పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉన్న హిల్లియర్ సరస్సు శక్తివంతమైన గులాబీ రంగుతో చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇది చుట్టుపక్కల ఉన్న నీలి మహాసముద్రానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. కెనడాలోని బాన్ఫ్ నేషనల్ పార్క్‌లో ఉన్న పేటో సరస్సు, నీటిలో సస్పెండ్ చేసిన హిమనదీయ రాతి పిండి నుంచి వచ్చే అద్భుతమైన మణి నీలం రంగుతో ప్రర్యాటకులను ఆకర్షిస్తుంది.
రెట్బా సరస్సు, డునాలియెల్లా సాలినా అనే ఆల్గే ఉండటం వల్ల ఏర్పడిన గులాబీ రంగుతో చూడముచ్చటగా ఉంటుంది. ఇక ఈ సరస్సు సెనెగల్‌లో ఉంది. బొలీవియాలోని లగునా వెర్డే, రాగి వంటి ఖనిజ నిక్షేపాల వల్ల వచ్చే పచ్చని జలాలకు ప్రసిద్ధి చెందింది ఈ సరస్సు. ఇక మన దేశంలో ఉన్న ఐదు సరసుల గురించి కూడా తెలుసుకుందామా? సాంబార్ సరస్సు రాజస్థాన్లో ఉంది. ఇది మనదేశంలోనే అతి పెద్ద భూపరివేష్టిత ఉప్పు నీటి సరస్సు ఇదే. ఇక చిల్కా సరస్సు ఒరిస్సాలో కలదు. ఇది మనదేశంలోనే అతి పొడవైన ఉప్పునీటి లాగూన్ సరస్సు. ఊలార్ సరస్సు జమ్ముకశ్మీర్లో కలదు. ఇది మనదేశంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సుగా పేరు గాంచింది. ఇది జీనం నది వల్ల ఏర్పడిన సరస్సు.
గోవింద సాగర్ సరసు హిమాచల్ ప్రదేశ్ లో కలదు. ఇది మనదేశంలో కృత్రిమంగా నిర్మించిన అతిపెద్ద మంచినీటి సరస్సుగా పేరు గాంచింది. ఈ సరసు సట్లెజ్ నది వల్ల ఏర్పడిందట. చోలాము సరస్సు సిక్కిం రాష్ట్రంలో ఉంది. 2011, ఆగస్టులో ఈ సరస్సును సర్వే ఆఫ్ ఇండియా గుర్తించడంతో దీని గురించి ప్రపంచానికి తెలిసింది. ఇది మన దేశంలో ఎత్తయిన సరస్సుగా పేరు కాంచింది..