New Bride Letter: ప్రతి ఆడపిల్ల జీవితంలో పెండ్లి అనేది ఓ పెద్ద అధ్చాయం. అప్పటి వరకు ఉన్న జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసే కార్యక్రమమే పెండ్లి. ఇంటి పేరు మారుతుంది. తల్లి దండ్రులకు దూరం అవుతుంది. పుట్టిన ఊరును విడిచిపెడుతుంది. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త బాధ్యతలు, పద్ధతులు అంటూ.. ఇలో ఆమె జీవితంలోకి ఒకేసారి ఎంట్రీ అవుతాయి. కానీ వీటన్నింటి గురించి మొదటగా ఎవరూ ఆలోచించరు. కేవలం పెండ్లి అంటే ఎన్నో కలలు కంటారు ఆడపిల్లలు.

ఇలా కలలు కని, అత్తింట్లో అడుగు పెట్టిన ఓ అమ్మాయి.. తన మనసులో ఉన్న బాధను, బాధ్యతను గుర్తు చేస్తూ తన తల్లికి ఓ లేఖ రాసింది. ఇది అందరి మనసులను కదిలిస్తోంది. ఇంతకు అందులో ఆమె ఏం రాసిందో చూద్దాం. అమ్మా.. నీ దగ్గర ఉన్నట్టు నేను ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాను. నా ఇష్టం వచ్చినట్టు ఉండటానికి ఇక్కడ కుదరదు. ఇక్కడ అందరూ నా పనితనం గురించే ఆలోచిస్తారు. నీ దగ్గర ఏం కావాలన్నా నువ్వు చేసిపెట్టేదానివి.
కానీ ఇక్కడ ఎవరికి ఏం కావాలన్నా నేనే చేసి పెట్టాలి. అందరికీ అన్ని చేసిపెట్టడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. నా ఇష్టం వచ్చినట్టు పంజాబీ డ్రెస్ వేసుకుని తిరగలేను. నాకంటూ కొన్ని పద్ధతులు, నిబంధనలు ఉంటాయి. వాటికి అనుగుణంగానే నడుచుకోవాలి. ఇష్టం వచ్చినప్పుడు లేవలేను. అందరికంటే ఉదయాన్నే లేచి అన్నీ రెడీ చేసి పెట్టాలి. అలసిపోవడం అనే మాటను మర్చిపోవాలి. ఇష్టం వచ్చినప్పుడు పడుకోలేను.
Also Read: సాఫ్ట్ వేర్ బూమ్: ఇంజినీరింగ్ స్టూండెంట్స్ కు మంచి రోజులు..
ఇవన్నీ చూస్తుంటే.. ఒక్కోసారి నీ దగ్గరే హాయిగా ఉండిపోక.. ఎందుకు పెండ్లి చేసుకున్నానా అనిపిస్తుంది. కానీ అలాంటి సమయంలోనే నువ్వు కూడా నీ ఇంటిని వదిలి వచ్చావు కదా అని గుర్తుకు వస్తుంది. నువ్వు మాకోసం నీ సంతోషాన్ని, సుఖాన్ని వదులుకుని ఇన్ని త్యాగాలు చేశావని తలుచుకుంటాను. కాబట్టి నేను కూడా నన్ను నమ్ముకున్న మెట్టినింటి కోసం చేయాలి కదా అని నన్ను నేను సమర్థించుకుంటాను. నువ్వు నేర్పిన బుద్ధులు మెట్టినింట్లో నా జీవితాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతాయి. థాంక్యూ అమ్మా.. అంటూ కొత్తగా పెండ్లి అయిన అమ్మాయి ఇలా రాసుకొచ్చింది. అంటే తనలోని భయాన్ని, బాధను, బాధ్యతను అన్నింటినీ ఇలా కలిపి తాను ఉత్తమ ఇల్లాలు అనిపించుకునేందుకు ప్రయత్నిస్తానంటూ చెప్పుకొచ్చిందన్న మాట. ఈ లేఖ ఇప్పుడు ప్రతి అమ్మాయికి జరుగుతున్న దాన్ని స్పష్టంగా గుర్తు చేస్తోంది.
Also Read: వారానికి ఏడు రోజులు ఎందుకు ఉన్నాయి.. ఇలా ఉండటానికి కారణం ఏంటో తెలుసా?