
Bride Dance : మనదేశంలో పెళ్లి అత్యంత వైభవంగా చేసుకుంటారు. జీవితంలో ఒకేసారి చేసుకునే శుభకార్యం కావడంతో బంధువులు, స్నేహితులు అంతా కలిసి కల్యాణాన్ని కమణీయంగా తీర్చిదిద్దుతారు. మేళతాళాలు, పందిరిగుంజలు, ఆహుతుల ఆనందాలు వెరసి వివాహం ఓ శోభాయమానంగా వెలిగిపోతుంది. ఇంకా డ్యాన్సులు కూడా ఇరగదీస్తారు. బ్యాండ్ మేళాల చప్పుళ్లకు అందరు ఊగిపోతారు. ఆనందమయంగా జరుపుకునే వేడుక పెళ్లి తతంగం. దీంతో వారం రోజుల పాటు ఇంటి నిండా బంధువుల సందడి కనిపిస్తుంది. ఎటు చూసినా వారి పలకరింపులు వినిపిస్తాయి. పనులు చేసే క్రమంలో హడావిడి కనిపించడం మామూలే.
పెళ్లిలో ఇతరుల డ్యాన్సులు చేయడం పరిపాటే. కానీ వధూవరులు డ్యాన్స్ చేస్తే చూట ముచ్చటగా ఉంటుంది. చూసేవారంతా ఆశ్చర్యపోతారు. పెళ్లి చేసుకోవాల్సిన వధువు చేసిన ఇక్కడ అందరిని కట్టి పడేసింది.ఆమె వేసిన స్టెప్పులకు అందరు హతాశులయ్యారు. యోగా డ్యాన్సు అయితే అంతా గుక్కతిప్పుకోకుండా చూశారు. పెళ్లి పీటల మీద కూర్చుండాల్సిన వధువు డ్యాన్స్ చేయడంతో అందరు ఆసక్తిగా చూశారు.
వధువు చేసిన డ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆమె చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. నెటిజన్లు పెళ్లి కూతురు యోగా చేస్తోందా డ్యాన్స్ చేస్తోందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పెళ్లి కూతురు వేసిన స్టెప్పులు అందరి మనసులను గెలుచుకున్నాయి. కాబోయే వధువు చేసిన డ్యాన్స్ అందరు ఆసక్తిగా చూశారు.
సాధారణంగా పెళ్లిళ్లలో ఇతరులు డ్యాన్స్ చేయడం సహజమే. కానీ వధువు డ్యాన్స్ చేసి అందరిని మంత్రముగ్దులను చేసింది. తన హావభావాలతో కొత్తగా కనిపించింది. యోగా చేస్తున్నట్లుగా వేసిన స్టెప్పులతో ఈలలతో గోల చేశారు. కాబోయే పెళ్లి కూతురు డ్యాన్స్ చేయడంతో కొందరు వింతగా చూసినా చాలా మంది ఆమెను ప్రశంసించారు. ఆమె వేసిన స్టెప్పులు అందరికి ఉత్సాహం నింపాయి.