
Dhoni- Ishant Sharma: టీం ఇండియాలో ఒకప్పుడు వెలుగు వెలిగిన క్రికెటర్లు జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. అయితే కొన్ని అపజయాలకు కూడా పరోక్షంగా కారణమైన వారూ ఉన్నారు. ఆ సందర్భంగా వారు పడిన వేదన రిటైర్మెంట్ తర్వాత వివిధ సందర్భాల్లో బయటకు చెబుతున్నారు. ఆటోబయోగ్రఫీలో రాసుకుంటున్నారు. ఇంటర్వ్యూలలో వెల్లడిస్తున్నారు. తాజాగా ఓ పాస్ట్ బౌలర్ తాను విఫలమైన సందర్భంలో పడిన బాధ, ఎదుర్కొన్న మానసిక ఇబ్బందిని ఓ టీవీషోలో వెల్లడించాడు.
మొహాలీ వన్డే ఓటమితో..
ఇషాంత్‌శర్మ.. టీమ్‌ఇండియాలో చాలాకాలంపాటు కీలకమైన ఫాస్ట్‌బౌలర్‌గా కొనసాగాడు. అద్భుతమైన బౌలింగ్‌తో జట్టుకు ఎన్నో మ్యాచ్‌ల్లో విజయాలనందించాడు. అయితే, ప్రతీ క్రికెటర్ కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఉన్నట్లే.. జట్టును గట్టెక్కిస్తాడనుకున్న క్రీడాకారుడే ఓటమికి కారణం అయినట్లు.. అలాంటి అనుభవమే ఇషాంత్‌శర్మకు ఎదురైంది. 2013లో ఆస్ట్రేలియా భారత పర్యటనకు వచ్చింది. మొహాలీలో జరిగిన వన్డేలో ఇషాంత్ శర్మ పేలవమైన బౌలింగ్ చేయడంతో మ్యాచ్‌ని టీమ్‌ఇండియా చేజార్చుకుంది. దీంతో అతడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పుడు కెప్టె¯Œ గా ఉన్న ధోనీ, సహచర ఆటగాడు శిఖర్‌ధావన్ ఎలా మద్దతుగా నిలిచారనే విషయాన్ని ఇషాంత్‌శర్మ తాజాగా వెల్లడించాడు.
ఆమెకు ఫోన్‌చేసి బోరున విలపించాడు..
2013లో మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ ఇషాత్ జీవితంలో చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ మ్యాచ్ తర్వాత పడిన బాధ ఎన్నడూ పడలేదని ఇషాత్ షోలో స్వయంగా వెల్లడించాడు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఇషాత్ భారీగా పరుగులు సమర్పించాడు. ఫలితంగా జట్టు ఓడిపోయింది. వాస్తవాన్ని గుర్తించిన ఇషాత్ తన పేలవ బౌలింగే జట్టు ఓటమికి కారణంగా భావించాడు. అప్పుడు డేటింగ్ చేస్తున్న తన భార్యకు ఫోన్‌చేసి ఈ విషయం తలుచుకుని విలపిచేవాడట. ఇలా ఒకరోజు రెండో రోజులు కాదు.. దాదాపు నెల రోజులు ఏడ్చానని ఇషాత్ వెల్లడించాడు.
అండగా నిలిచిన ధోనీ..
ఆ సమయంలో కెప్టె¯Œ ధోనీతోపాటు సహచర ఆటగాడు శిఖర్‌ధావన్ తనకు అండగా నిలిచారని ఇషాత్ గుర్తు చేసుకున్నాడు. ‘ధోనీ భాయ్, శిఖర్ ధావన్ నా రూమ్‌లోకి వచ్చారు. చూడు.. నువ్వు బాగా ఆడుతున్నావు అని చెప్పి మద్దతుగా నిలిచారు’ అని ఇషాంత్‌శర్మ చెప్పాడు. కానీ, ఆ ఒక్క మ్యాచ్ కారణంగా తాను పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సరిపడే బౌలర్‌ని కాను అనే అభిప్రాయం ఏర్పడిందని చెప్పాడు ఇషాత్.

ఆటకు దూరం..
అయితే ఇషాంత్ శర్మ ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. కానీ, కొత్త రక్తాన్ని ప్రోత్సహిస్తున్న సెలక్టర్లు సీనియర్లను పక్కన పెడుతున్నారు. ఈ క్రమంలో ఇషాంత్‌ను కూడా చాలా కాలంగా జాతీయ జట్టుకు ఎంపిక చేయడం లేదు. దీంతో ఇషాంత్ 2021 నవంబర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత జాతీయ జట్టుకు సెలక్ట్ కాలేదు. తాజాగా రిటైర్మెంట్ ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం.