Homeక్రీడలుUmran Malik: అరువు షూస్ తో ఆడి.. ఐపీఎల్ వ‌ర‌కు... ఫాస్ట్ బౌల‌ర్ ఉమ్రాన్ మాలిక్...

Umran Malik: అరువు షూస్ తో ఆడి.. ఐపీఎల్ వ‌ర‌కు… ఫాస్ట్ బౌల‌ర్ ఉమ్రాన్ మాలిక్ కథ ఇది

Umran Malik: జమ్మూకశ్మీర్‌కు చెందిన 22 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరిగిన ప్రతి సారి వార్త‌ల్లో నిలుస్తాడు. ఎందుకంటే అతని బంతులు రాకెట్ లా దూసుకెళ్తుండటమే కారణం. ఉమ్రాన్ బౌలింగ్ చేస్తుంటే దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్‌ను క్రికెట్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. 150 కిలోమీటర్ల వేగంతో అలవోకగా బంతులు విసరగల ఉమ్రాన్.. ఐపీఎల్ 2022లో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. లక్నో మీద జరిగిన మ్యాచ్‌లో 152.4 కిలోమీటర్ల వేగంతో ఉమ్రాన్ విసిరిన బంతి.. ఐపీఎల్ 2022లో ఫాస్టెస్ట్ డెలివరీగా రికార్డు సృష్టించింది.

Umran Malik
Umran Malik

2017 వరకు ఉమ్రాన్ మాలిక్ కు ప్రొఫెషనల్ క్రికెట్ గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు ఐపీఎల్‌లో ప్రత్యర్థి బ్యాటర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. అయితే త‌న స్నేహితుడు అబ్దుల్ సమద్ తన కోచ్ రణధీర్ మన్హాస్‌ని ఉమ్రన్ వద్దకు తీసుకువెళ్లి.. అతని బౌలింగ్ చూడమని అభ్యర్ధించాడు. నెట్స్‌లో ఉమ్రాన్ బౌలింగ్‌ని చూసిన కోచ్ కూడా ఆశ్చర్యపోయాడు. దీంతో, అక్కడ నుంచి ఉమ్రాన్ ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారడం మొదలైంది.

Also Read: Sudigali Sudheer Remuneration: సుడిగాలి సుధీర్ సంపాదన ఎంతో తెలుసా..? స్టార్ హీరోలు కూడా పనికిరారు

ఉమ్రాన్ మాలిక్ జమ్మూలో అండర్-19 క్రికెట్ జట్టు కోసం అరువు తెచ్చుకున్న స్పైక్ షూస్ ధరించి ట్రయల్ ఇచ్చాడు. ఆ తర్వాత జమ్మూ మరియు కాశ్మీర్ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ అతను వినూ మన్కడ్ ట్రోఫీలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. మరుసటి ఏడాది, అండర్-23 ట్రయల్స్‌లో మాలిక్ వైఫల్యాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అయితే, 2019-20 రంజీ ట్రోఫీ సీజన్‌లో ఉమ్రాన్ కు ఊహించని అదృష్టం తలుపు తట్టింది.

భారత మాజీ వికెట్ కీపర్, అస్సాం కోచ్ అజయ్ రాత్రా ఉమ్రాన్ మాలిక్ గురించి జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ అధికారులతో మాట్లాడాడు. ఉమ్రాన్ ను జట్టులోకి తీసుకోవాలని సిఫార్సు చేశాడు. ఆ తర్వాత ఇర్ఫాన్ పఠాన్ కూడా ఉమ్రాన్ ప్రతిభను గుర్తించి, జమ్మూ కాశ్మీర్ సీనియర్ జట్టులో ఈ బౌలర్ ఎంట్రీని ఫిక్స్ చేశాడు.

Umran Malik
Umran Malik

ఈసారి సీజన్‌లో అత్యంత వేగంగా బంతులు వేసిన బౌలర్ల జాబితా చూస్తే.. టాప్‌-5లో అన్ని పేర్లూ ఉమ్రాన్‌వే. సోష‌ల్ మీడియాలో ఉమ్రాన్ బౌలింగ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత జట్టుకు మరో ఫాస్ట్ బౌలర్ దొరికాడంటూ పోస్టులు చేస్తున్నారు. ఉమ్రాన్ లైన్ అండ్ లెంగ్త్ కూడా వేస్తే సన్‌రైజర్స్ జట్టుకు ఇక ఢోకా ఉండద‌ని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఉమ్రాన్ ఎంత వేగంగా బంతులు విసిరినా అది లైన్ తప్పుతుండటంతో బ్యాటర్లకు భారీ షాట్లు కొట్టే అవకాశాలు కల్పిస్తున్నాడని క్రికెట్ వర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. అయితే ఉమ్రాన్ స్పీడ్‌కు లైన్ అండ్ లెంగ్త్ తోడైతే ఈ ఫాస్ట్ బౌల‌ర్ కి తిరుగుండ‌ద‌ని అంటున్నారు.

Also Read:Chiranjeevi: కొడుకుపై చిరంజీవి మమకారం.. ఆ ‘హనుమ’పై ప్రేమకు ఇది త్కారాణం

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

  1. […] Acharya: మెగాస్టార్ చిరంజీవి మరియు కొరటాల శివ కాంబినేషన్ తెరకెక్కిన ఆచార్య సినిమా ఎట్టకేలకు ఎన్నో వాయిదాల అనంతరం ఈ నెల 29 వ తారీఖున ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాలో మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్క ముఖ్య పాత్రలో నటించాడు..#RRR తర్వాత ఆయన పెద్ద గాప్ తీసుకోకుండా వెండితెర మీద కనిపిస్తున్న సినిమా ఇదే..ఇటీవలే విడుదల అయినా ఈ సినిమా ట్రైలర్ కి కూడా అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. ఈ ట్రైలర్ లో చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన షాట్స్ అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తున్నాయి..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక్క లేటెస్ట్ వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..అదేంటో ఇప్పుడు మనం చూడబోతున్నాము. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular