సంతాన లేమికి పురుషుల్లో ఆ లోపమే కారణం .. ! CCMB సంచలన నిజాలు

టీఈఎక్స్ 13 బి జన్యువులోని రెండు కారణ ఉత్పరివర్తనాల ద్వారా ఫలితాలను రాబట్టారు. పురుషుల్లో ఉండే స్పెర్మ్ ఉత్పత్తిలో టీఈఎక్స్ 13 బి లోపం ప్రభావం చూపుతుందని అన్నారు. స్పెర్మాటోనెజిక్ తో బాధపడే పురుషులను పరీక్షించానికి ఈ పరిశోధనలు ఉపయోగపడుతాయని అన్నారు

Written By: Chai Muchhata, Updated On : May 17, 2024 2:12 pm

Male Infertility

Follow us on

ప్రతి ఒక్కరి జీవితంలో తమ పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. పెళ్లయిన తరువావ కొన్ని రోజుల పాటు ఎంజాయ్ చేద్దామని కొందరు కోరుకుంటే.. వెంటనే పిల్లలు ఉండాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే పిల్లలు కావాలనే కొందరికి సంతానం కలగదు. దీంతో వారు తీవ్ర నిరాశతో ఉంటారు. సంతాన లేమికి ఆడవారే కారణంటూ ఇరుగు, పొరుగువారు నిందిస్తూ ఉంటారు. కానీ సంతాన లేమికి ఆడవారు మాత్రమే కాకుండా మగవారిలోనూ లోపాలు ఉంటాయని పరిశోధకులు తెలుపుతున్నారు. కొన్ని పరిశోధనల వల్ల పురుషుల్లో ఉండే స్పెర్మ్ కౌంట్ తగ్గితే పిల్లలు కలగకపోవచ్చని అంటున్నారు. లేటేస్ట్ గా Central For Cellular And Molecular Biology(CCMB) నిర్వహించిన పరిశోధన ప్రకారం షాకింగ్ విషయాలు బయటపెట్టారు. అవేంటంటే?

సీసీఎంబీ తాజాగా పురుషుల్లో వీర్య కణ అభివృద్ధిపై పరిశోధనలు జరిపింది. పిల్లలు కలగకపోవడానికి ఆడవారితో పాటు మగవారిలో ఎలాంటి లోపాలు ఉంటాయోననే దానిపై పరిశీలించింది. సీసీఎంబీ ప్రధాన శాస్త్రవేత్తలు తంగరాజ్, చంద్రశేఖర్, స్వప్తి రాయ్ చౌదరి లు కలిసి ఈ పరిశోధనలు చేశారు. వీటి వివరాలను ‘హ్యుమన్ రీ ప్రొడక్షన్ జర్నల్’లో ప్రచురించారు. సంతాన లేమి కారణానికి పురుషుల్లో టీఈఎక్స్ 13బి లోపం కారణమని తేల్చారు.

టీఈఎక్స్ 13 బి జన్యువులోని రెండు కారణ ఉత్పరివర్తనాల ద్వారా ఫలితాలను రాబట్టారు. పురుషుల్లో ఉండే స్పెర్మ్ ఉత్పత్తిలో టీఈఎక్స్ 13 బి లోపం ప్రభావం చూపుతుందని అన్నారు. స్పెర్మాటోనెజిక్ తో బాధపడే పురుషులను పరీక్షించానికి ఈ పరిశోధనలు ఉపయోగపడుతాయని అన్నారు. మరో విషయమేంటంటే ఈ టీఈఎక్స్ 13 బి లోపం పురుషులకు తన తల్లి నుంచే సంక్రమిస్తుందని చెప్పారు. అంటే గతంలో తల్లి సంతాన లేమితో బాధపడి ఉంటే.. సీక్వెన్సీగా తన కుమారుడు కూడా అదే ప్రభావం చెందుతాడని చెప్పారు.

చాలా మంది సంతానంపై తీవ్ర నిరాశతో ఉంటారు. ఆడవారిలో ఉన్న కొన్ని లోపాల వల్ల సంతాన లేమి అని అనుకుంటారు. కానీ పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ విషయంలో మరింత లోతుగా టీఈఎక్స్ 13 బి గురించి తెలుసుకుంటే ఎక్కడ లోపం ఉందో గుర్తించవచ్చని పరిశోధకులు చెప్పారు. ఇదిలా ఉండగా ఎలుకల్లో స్పెర్మ్ ఉత్పత్తి కణాల సెల్ కల్చర్ పై పరిశోధన చేసి చేశారు. క్రిస్పర్ కాస్ 9 అనే టెక్నాలజీని ఉపయోగించి టీఈఎక్స్ 13 బి ని తొలగించి చూశారు. ఇలా చేయడం వల్ల స్పెర్మ్ కణాల సంఖ్య పూర్తిగా తగ్గినట్లు గుర్తించారు. దీంతో సంతానోత్పత్తికి టీఈఎక్స్ 13 బి ప్రధానమైని తేల్చారు.