Drunk & Drive: మద్యం సేవించి వాహనం నడపకూడదు అనే ఉద్దేశంతో ప్రతిరోజు నగరాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అయితే చాలామంది మద్యం సేవించి వాహనాలు నడిపేవారు ఎక్కువే ఉన్నారు. మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో దొరికిపోయి జరిమానాలు చెల్లిస్తున్నారు. మరికొందరు జైలుకు వెళ్లి శిక్ష ను అనుభవిస్తున్నారు. మద్యం తాగే అలవాటు ఉన్నవారికి ఇది పెద్ద సమస్యగా మారింది. కానీ మద్యం తాగకుండా కూడా కొందరు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. తమకు అసలు డ్రింక్ చేసే అలవాటు లేకున్నా ఇలా ఎందుకు వచ్చిందని కొందరు ఆందోళన చెందారు. అయితే అది బ్రీత్ ఎనలైజర్ మిషన్ ప్రాబ్లం అని కొందరు వాదిస్తున్నారు. వాస్తవానికి అది కాదు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో డ్రింక్ తీసుకోకుండా పాజిటివ్ రావడానికి కారణం ఏంటంటే?
Also Read: కేరళలో క్రమక్రమంగా పెరుగుతున్న బీజేపీ ఓట్ల శాతం
కడుపులో జరిగే కొన్ని రసాయన క్రియల వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుంది. దీనినే Auto Bravery Syndrome అని అంటారు. అంటే కడుపులో గ్యాస్ లాగా తయారైన ఒక వాయువు నోటి ద్వారా రావడంతో ఇది ఆల్కహాల్ గా మారిపోయి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో పాజిటివ్గా చూపిస్తుంది. కడుపులో ఉండే గ్యాస్ట్రో లో కుడి ఎడమవైపు ఉన్న ఆమ్లాలు కలిసిపోయి ఈథనాల్ ను రిలీజ్ చేస్తాయి. దీంతో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో ఆల్కహాల్ తీసుకున్నట్లుగా చూపిస్తుంది.
అయితే ఈ ఈథనాల్ రిలీజ్ అయిన సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో మాత్రమే కాకుండా శరీరంలో కూడా అనేక మార్పులు వస్తుంటాయి. దీనితో తీవ్ర నీరసంగా ఏర్పడుతుంది. డిప్రెషన్కు కూడా గురవుతారు. అంతేకాకుండా మద్యం సేవించిన వారిలా మత్తుగా ఉంటారు. ఒక్కోసారి మాట తడబడుతూ ఉంటుంది. చాలా విషయాలు మర్చిపోతూ ఉంటారు. అంతేకాకుండా ఈ ఈథనాల్ రిలీజ్ కావడంతో లివర్ డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఉంది. అలాగే మానసికంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
Also Read: ఈ ఏడాదిలోనే రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’..సెన్సేషనల్ డేట్ ని లాక్ చేసిన మేకర్స్!
అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే లో డార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. అంటే జంక్ ఫుడ్ తో పాటు ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఇలాంటి వాయువు ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా కొన్నాళ్లపాటు ఆల్కహాల్ తీసుకొని.. ఆ తర్వాత మానేసినా కూడా ఇటువంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆహారం తీసుకునే సమయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లైట్ ఫుడ్ మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయాలి. ఈ సమస్య ఒక్కసారి వచ్చిందంటే అప్పటినుంచి ఆహార పద్ధతులు మొత్తం మార్చుకోవాలి. లేకుంటే ఈ ఈథనాల్ పదేపదే రిలీజ్ కావడం వల్ల మద్యం సేవించకుండా తాగుబోతుల ముద్ర పడిపోతారు. దీంతో కోర్టు కేసులు అవుతూ మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.