New Milestone: హైదరాబాద్, జూన్ 2022: టెక్-ఎనేబుల్డ్ ఫ్రెష్ మీట్ అండ్ సీఫుడ్ ఆర్డరింగ్ ప్లాట్‌ఫామ్ టెండర్‌కట్స్ మరో విజయాన్ని సాధించింది. రోజు గంటకు 2500 ఆర్డర్‌లను స్వీకరించి కీలక మైలురాయిని సాధించినట్లు ప్రకటించింది. చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌ల లో టెండర్‌కట్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అనేక గిడ్డంగులు, పలు దుకాణాల నుంచి సమర్థవంతమైన డెలివరీ నెట్‌వర్క్ సహాయంతో వినియోగదారులకు అందుబాటు ధరలో సేవలు అందిస్తోంది టెండర్‌కట్స్ సంస్థ. దక్షిణాదిలో అతిపెద్ద టెక్-ఎనేబుల్డ్ ఫ్రెష్ మీట్ అండ్ సీఫుడ్ ఆర్డరింగ్ ప్లాట్‌ఫామ్ గా అవతరిస్తూ ప్రారంభమైన అనతి కాలంలోనే టెండర్‌కట్స్ 200 శాతం కొత్త కస్టమర్లతో11లక్షల మంది కస్టమర్‌లను ఆకర్షించ గలిగింది. టెండర్‌కట్స్ కోసం75 శాతం వ్యాపారం ఆన్‌లైన్ నుంచి , మిగిలిన వ్యాపారం స్టోర్‌ల నుండి వాక్-ఇన్‌ల ద్వారా వస్తుంది.

ఈ సందర్భంగా టెండర్‌కట్స్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వెంకటేశన్ మాట్లాడుతూ “మా టెక్నాలజీ ఫ్రేమ్‌వర్క్ గంటకు 2500 ఆర్డర్‌లను హ్యాండిల్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. తక్కువ సమయంలో టెండర్‌కట్స్ అభివృద్ధి చెందడమేకాకుండా మా ఉత్పత్తులపై ఎక్కువ మంది కస్టమర్‌లు తమ విశ్వాసాన్నిఉంచారు అందుకు మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం” మెరుగైన సేవలు అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నాము. “ఫ్రెష్‌నెస్ ట్రాకర్” ద్వారా మా కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన క్షణం నుంచి వారి ఆర్డర్‌లను ట్రాక్ చేయవచ్చు, తద్వారా వారు “ఫ్రెష్‌నెస్ కట్” మాంసాన్ని స్వీకరించడానికి అవకాశం ఉంటుందని” ఆయన అన్నారు.
Also Read: Early Elections in Telangana: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు?

“తాజాగా కట్ చేసిన మాంసం,సీ ఫుడ్ ఎంపిక, ప్రాసెసింగ్, సంరక్షణ, ప్యాకేజింగ్ పంపిణీకి టెండర్‌కట్స్ విభిన్నమైన ఆహార సాంకేతికత అప్లికేషన్ పరిశ్రమలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయడంలో సహాయపడిందని” టెండర్‌కట్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వెంకటేశన్ పేర్కొన్నారు. “టెండర్‌కట్స్ ఓమ్ని-ఛానల్ మీట్ & సీఫుడ్ కంపెనీ. ఇది మాంసాహారం, సీఫుడ్ రిటైల్ ప్రక్రియపై ప్రత్యేక మైన దృక్పథంతో 2016లో నిశాంత్ చంద్రన్ స్థాపించారు.

కంపెనీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) సర్టిఫికేట్ పొందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా తాజా నాణ్యమైన మాంసాన్ని అందిస్తుంది. టెండర్‌కట్స్ భారతదేశంలో కోళ్ల పెంపకం, ఆక్వాకల్చర్‌లో విప్లవాన్ని తీసుకువచ్చిందని టెండర్‌కట్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వెంకటేశన్ తెలిపారు. చికెన్, సీఫుడ్, మటన్ అత్యుత్తమ ఎంపికకు అవకాశం లభిస్తుంది. వీటిని ఆన్‌లైన్‌లో, ఫోన్ ద్వారా లేదా చెన్నై , హైదరాబాద్, బెంగళూరులలో ఉన్న టెండర్‌కట్స్ రిటైల్ ఎక్స్‌పీ రియన్స్ స్టోర్‌లలో ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
Also Read:
Pawan Kalyan Emotional : ఆ వీడియో చూసి ఎమోషనల్ అయిన పవన్ కళ్యాణ్