Pawan Kalyan Emotional : ఆ వీడియో చూసి ఎమోషనల్ అయిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan Emotional : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ పర్ ఫామెన్స్ ఇచ్చిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. పవన్ లోని వీరావేశం.. పవన్ లోని చిలిపిదనం.. పవన్ లోని ప్రేమికుడు, ఎమోషన్ ఇలా అన్నీ కలగలిపి అతడి ఇండస్ట్రీలో స్టార్ హీరోను చేసింది. నవరసాలు పలకగల టాలీవుడ్ హీరో ఎవరయ్యా అంటే అది పవన్ కళ్యాన్ మాత్రమే. ముఖ్యంగా పవన్ లోని ఆవేశపూరితం ఒక చే గువేరాలా భీకరంగా ఉంటుంది. అలాంటి పవన్ […]

  • Written By: NARESH ENNAM
  • Published On:
Pawan Kalyan Emotional : ఆ వీడియో చూసి ఎమోషనల్ అయిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan Emotional : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ పర్ ఫామెన్స్ ఇచ్చిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. పవన్ లోని వీరావేశం.. పవన్ లోని చిలిపిదనం.. పవన్ లోని ప్రేమికుడు, ఎమోషన్ ఇలా అన్నీ కలగలిపి అతడి ఇండస్ట్రీలో స్టార్ హీరోను చేసింది. నవరసాలు పలకగల టాలీవుడ్ హీరో ఎవరయ్యా అంటే అది పవన్ కళ్యాన్ మాత్రమే. ముఖ్యంగా పవన్ లోని ఆవేశపూరితం ఒక చే గువేరాలా భీకరంగా ఉంటుంది.

అలాంటి పవన్ కళ్యాణ్ లోని నటనా కౌశలాన్ని.. నవరసాలను తాజాగా ఒక వీడియో రూపంలో ‘అంటే సుందరానికి’ అనే మూవీ ప్రీరిలీజ్ వేడుక సందర్భంగా రూపొందించి విడుదల చేశారు. పవన్ కళ్యాన్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ తో సినిమా చేస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ ఈ వీడియోను తయారు చేశారు. చివర్లో తన సినిమా పోస్టర్ ను వేసి పవన్ కళ్యాణ్ కు అంకితం ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ కోసం ఈ స్పెషల్ వీడియోను తెరపై ప్రదర్శించారు. తన మొదటి చిత్రం నుంచి ఇప్పటివరకూ నవరసాలు ఉన్న ఆ వీడియోను చూసి పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. పవన్ నటించిన చిత్రాల్లోని పవర్ ఫుల్ డైలాగ్స్, ఆయన నటనపై సినీ ప్రముఖుల ప్రశంసలు, క్రేజీ సాంగ్స్ కు వేసిన స్టెప్పులు.. ఇలా పవన్ పూర్తి సినీ జీవితం ఆ వీడియోలో ప్రదర్శించారు. ఈ వీడియో చూడగానే పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. పవన్ ఉద్వేగానికి గురైన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పవన్ కళ్యాణ్ పై ‘అంటే సుందరానికి ’ ప్రీరిలీజ్ వేడుకలో ప్రదర్శించిన ఈ ప్రత్యేక ఏవీ చూశాక పవన్ కళ్యాణ్ ఆసక్తికరంగా స్పందించాడు. తనకు అసలు డ్యాన్స్ చేయడం అంటే ఇష్టం ఉండదని.. డైరెక్టర్లు తన పాయింట్ బ్లాంక్ లో పెట్టి చేయిస్తారని తెలిపారు. తనకు పాట వస్తుంటే నడుచుకుంటూ వెళ్లడమే ఇష్టమన్నారు. అభిమానుల కోసమే ఈ డ్యాన్సులు గట్రా అంటూ చెప్పుకొచ్చారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ రాకతో ‘అంటే సుందరానికి’ కావాల్సినంత ప్రమోషన్ దక్కింది. పవన్ అభిమానులకు ఓ మంచి వీడియో కానుకగా లభించింది.

 

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు