Rishabh Pant Accident: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో శుక్రవారం తెల్లవారు జామున 5.30 గంటలకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కే వద్ద జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కాపాడింది ఓ బస్సు డ్రైవర్. బస్సు డ్రైవర్ కు క్రికెట్ అంటే తెలియదు. అందుకే పంత్ ను గుర్తుపట్టలేదు. సామాన్యుడిగానే భావించి కారులోంచి బయటకు తీయాలని ప్రయత్నించాడు. బస్సులోని ప్రయాణికులు గుర్తుపట్టి అతడు క్రికెటర్ అని చెప్పారు. పంత్ తన తల్లికి ఫోన్ చేసి ప్రమాదం గురించి తెలియజేయాలని సూచించడంతో సమాచారం అందించారు.

బస్సు డ్రైవర్ సుశీల్ మాన్ కారు ప్రమాదంలో చిక్కుకున్న పంత్ ను బయటకు తీసి అంబులెన్స్ కు సమాచారం అందజేశాడు. అప్పటికే అతడికి తీవ్ర గాయాలయ్యాయి. నడవలేని స్థితిలో ఉండటంతో అంబులెన్స్ వచ్చి పంత్ ను ఆస్పత్రికి పంపించారు. కారులోంచి మంటలు చెలరేగడంతో పంత్ దూకేందుకు ప్రయత్నించాడు. కారులో నుంచి సగం బయటకు వచ్చిన అతడిని పూర్తిగా బయటకు తీసే సరికి నుదురు, వీపుపై గాయాలు ఉన్నాయి. పోలీసులకు ఫోన్ చేస్తే బిజీ రావడంతో అంబులెన్స్ కు కాల్ చేసి రావాలని కోరగా వారు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లారు.
పంత్ పరిస్థితి మరింత తీవ్రంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం డెహ్రాడూన్ తరలించారు. పంత్ ను కారులో నుంచి తీయడం కొంచెం ఆలస్యమైతే అతడి ప్రాణాలు దక్కేవి కాదు. కారు డిజైన్ కూడా అదే విధంగా ఉండటంతో పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. లేకపోతే అది కొట్టిన పల్టీలకు పంత్ ప్రాణాలు అప్పటికే పోయి ఉండేవి. పంత్ ప్రాణాలు రక్షించిన బస్సు డ్రైవర్ ను అందరు ప్రశంసిస్తున్నారు. రియల్ హీరోగా అభివర్ణిస్తున్నారు. బస్సుకు దాదాపు మూడు వందల మీటర్ల దూరంలో కారులో మంటలు చెలరేగడం చూసిన డ్రైవర్ త్వరగా సంఘటన స్థలానికి చేరుకుని పంత్ ను సంరక్షించడంతో పంత్ సురక్షితంగా బతికి బయటపడ్డాడు.

బస్సు హరిద్వార్ నుంచి వస్తోంది. పంత్ ఢిల్లీలోని తమ బంధువుల ఇంటికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పంత్ పై ఉన్న బంగారం ఆభరణాలు మాయమైనట్లు కూడా సమాచారం. మొత్తానికి బస్సు డ్రైవర్ చేసిన సాయానికి పంత్ కు ఎలాంటి ఆపద రాలేదు. బస్సులోని ఓ ప్రయాణికుడు దుప్పటి కప్పి మంటలు ఆర్పాడు. అలా పంత్ కు ప్రాణాపాయం తప్పింది. 2022 సంవత్సరం చివరలో పంత్ కు గాయాలు కావడం ఆందోళనకు దారి తీస్తోంది. పంత్ కోలుకోవడానికి చాలా కాలమే పడుతుందని వైద్యులు చెప్పడం గమనార్హం.