Benefits Of Romance: శృంగారం బంగారం కంటే విలువైనది. అందుకే దాన్ని నాలుగు గోడల మధ్య చేసుకోవాలి. ఇటీవల కాలంలో శృంగారం బజారులో వస్తువుగా మారిపోయింది. పాశ్చాత్య ధోరణి పెరిగిపోతోంది. విచ్చలవిడితనం ఎక్కువవుతోంది. పూర్వం రోజుల్లో శృంగారం గురించి మాట్లాడటానికే సిగ్గుపడేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సెక్స్ ను అంగట్లో సరుకుగా మారుస్తున్నారు. రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు శృంగారం నేడు శృతిమించుతోంది. మగాళ్లను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు.

నేడు శృంగారం గతి తప్పుతోంది. జంతు సంస్కృతి పెరుగుతోంది. జంతువుల వలే మనుషుల ప్రవర్తన కూడా విచిత్రంగా ఉంటోంది. దీంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. వినాశకాలే విపరీతబుద్ధి అన్నట్లు మనుషుల నడవడిక కొత్త పుంతలు తొక్కుతోంది. బ్రహ్మంగారు చెప్పినట్లు వావివరసలు నశిస్తున్నాయి. సెక్స్ ను జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలే తప్ప జీవితమే సెక్స్ కాదని తెలుసుకోవాలి. శృంగారంలో ఎన్నో మెలకువలు ఉన్నా వాటిని తెలుసుకుని నడుచుకుంటే మనకు మేలు కలుగుతుంది.
శృంగారంతో రోగాలు కూడా దూరమవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మన శరీర అవయవాలు సరిగా పనిచేయడానికి కూడా సెక్స్ ఉపయోగపడుతుంది. ఈ విషయాలు తెలుసుకుని మసలుకుంటే మనకు తోడుగా నిలుస్తుంది. అండగా ఉంటుంది. జీవితం సుందరమయంగా మారేందుకు దోహదపడుతుంది. ఇన్ని రహస్యాలు ఉన్నందునే శృంగారం విలువైనదిగానే భావించుకుని దాన్ని ఆస్వాదించేందుకు సరైన సమయం కేటాయించుకోవాలి.

శృంగారంతో చాలా సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఒత్తిడి తగ్గించుకోవచ్చు. ఆందోళన లేకుండా చేసుకోవచ్చు. రోజు వ్యాయామం చేస్తే కూడా ప్రయోజనం కలుగుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. అందుకే శృంగారం కూడా మనకు అవసరమే. జీవితం సాఫీగా సాగాలంటే సెక్స్ ను ప్రధానంగా భావించుకోవచ్చు. దీంతోనే మనం నిత్య జీవితంలో కూడా శృంగారాన్ని ఒక భాగం చేసుకుని ముందుకు వెళితే లాభం కలుగుతుంది. సెక్స్ ను మనకు మంచి చేసే కార్యంగానే చూస్తుంటాం.