Husband And Wife Relationship: శృంగారంలో ఎన్నో మెలకువలు ఉంటాయి. ఎన్నో రకాల పద్ధతులు ఉంటాయి. జీవిత భాగస్వామిని సుఖపెట్టే క్రమంలో జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మనదేశంలో సెక్స్ గురించి మాట్లాడటం ఓ నేరంగా భావిస్తుంటారు. అందుకే బహిరంగంగా చర్చించడానికి ఇష్టపడరు. దీంతో ఎన్నో సందేహాలు మెదళ్లను తొలుస్తుంటాయి. అదే విదేశాల్లో ఎక్కడైనా సెక్స్ గురించి మాట్లాడుకోవచ్చు. చర్చించడం తప్పుగా భావించరు. దీంతో వారికి శృంగారం విషయంలో ఎలాంటి అనుమానాలు ఉండవు. ఒకవేళ ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు వెనకాడరు.

జీవిత భాగస్వామితో సరదాగా మాట్లాడాలి. అప్పుడప్పుడు టూర్లు చేస్తుండాలి. మనసు విప్పి ముచ్చటించాలి. వారికి ఏం అవసరం ఉందో గుర్తించి తెచ్చిపెడుతుంటే వారిలో మనపై ప్రేమ పుడుతుంది. భార్యను చెప్పుచేతల్లో ఉంచుకుంటే పనులు కూడా సులువుగా అవుతాయి. అందుకే వారికి పండుగలకు బహుమతులు ఇస్తుండాలి. సందర్భోచితంగా చీరలు కొనుగోలు చేస్తే కూడా సంతోషిస్తారు. దీంతో వారికి మనపై అభిమానం పెరుగుతుంది. తద్వారా సంసారం కూడా సాఫీగా సాగుతుంది.
ఇక శృంగారాన్ని కూడా నిర్లక్ష్యం చేయొద్దు. కనీసం వారంలో మూడు సార్లయినా శృంగారంలో పాల్గొంటే మనకు ఏ రోగాలు రాకుండా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆలుమగల మధ్య ప్రేమ పెరగడానికి శృంగారం కూడా కారణంగా భావించుకోవచ్చు. దీంతో సెక్స్ ను కూడా జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం మంచిది. దీనికి గాను ప్రతి జంట శృంగారాన్ని ఎంజాయ్ చేస్తేనే మేలు జరుగుతుంది. శృంగారం విషయంలో నిర్లక్ష్యం పనికి రాదు. సెక్స్ ను కూడా ఆస్వాదిస్తేనే ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది.

రోజుకు ఒకసారైనా ఐలవ్ యూ చెప్పుకుంటే ఇద్దరి మధ్య అన్యోన్యత కలుగుతుంది. ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. అప్పుడప్పుడు బయటకు వెళ్తుండాలి. భాగస్వామి కోసం సమయం కేటాయించాలి. ఆలుమగల మధ్య ప్రేమ చిగురించాలంటే ఇద్దరు కలిసి సరదాగా బయటకు వెళ్తుండాలి. చిన్న చిన్న బహుమతులు ఇస్తుండాలి. భార్యాభర్తల మధ్య అనుబంధం పెంచుకోవాలంటే ఏ రహస్యాలు ఉండకూడదు. మొత్తానికి ఆలుమగల మధ్య అంతరాలు పెరగకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటిస్తుండాలి.