Heroine Ileana: ఇల్లీ బేబీ అలియాస్ ఇలియానా.. అప్పుడెప్పుడో రామ్ హీరోగా దేవదాస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమను నాలుగేళ్ల పాటు ఏలింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి పూరి జగన్నాథ్ వరకు ఫస్ట్ చాయిస్ అయింది. పవన్ కళ్యాణ్ నుంచి ప్రభాస్ వరకు ఆడి పాడింది. ఆ తర్వాత నటించిన సినిమాలు మొత్తం బెడిసి కొట్టాయి. సినిమా పరిశ్రమ విజయాలు ఉన్నవారినే గౌరవిస్తుంది. ఇలియానా లాంటి హీరోయిన్లను తెలుగు చిత్ర పరిశ్రమ చాలా మందినే చూసింది. సో ఇలియానా ఫెడవుట్ అయిపోయింది. అప్పటికే అండ్రు నీ బోన్ అనే ఫోటోగ్రాఫర్ తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తర్వాత ఎక్కడో తేడాలు వచ్చాయి. ఇద్దరు కటీఫ్ చెప్పుకున్నారు. ఆ బాధ నుంచి బయటపడేందుకు ఇలియానా చాలా సమయమే తీసుకుంది. అవకాశాలు లేకపోవడంతో సన్నజాజి లాగా ఉండే ఇలియానా బాగా లావు అయిపోయింది. కానీ ఆమధ్య రవితేజతో ఉన్న సాహిత్యం వల్ల అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమాలో అవకాశం దక్కించుకుంది. కానీ ఆ సినిమా కూడా బెడిసి కొట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లు కనిపించకుండా పోయింది. ఇప్పుడు మాత్రం వార్తల్లో వ్యక్తి అయింది.

వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఇలియానా మాట్లాడుతూ పెళ్లి కాకుండానే శృంగారాన్ని ఆస్వాదిస్తున్నట్టు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. శృంగారం పై మీ అభిప్రాయం ఏంటని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడగగా..” నేను ఎప్పుడు కూడా శృంగారాన్ని ఆస్వాదిస్తాను. దానిని నేను ఒక వర్కౌట్ గా భావిస్తాను అంటూ” నిర్మొహమాటంగా చెప్పేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే రోజు శృంగారంలో పాల్గొంటుందేమోనన్నట్టు అనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు.
గతంలో ఆమెకు అండ్రు నీ బోన్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగించింది. కానీ ప్రస్తుతం కత్రినా కైఫ్ సోదరుడితో సహజీవనం చేస్తున్నట్టు సమాచారం. మేమిద్దరం సహ జీవనంలో ఉన్నామని ఇలియానా స్వయంగా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత వ్యవహారం బెడిసి కొట్టింది. ఇద్దరు కూడా బ్రేకప్ అనేసుకున్నారు. మధ్యలో ఓ బిజినెస్ మాన్ తో ఇలియానా” కథ” నడిపించింది అనే ప్రచారం జరిగింది. టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరోని బుట్టలో వేసుకుందని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. వారిద్దరు కలిసి పార్టీలకు వెళ్లిన ఫోటోలను అచ్చేసింది. అయితే ఇలియానా “విశాలమైన మనసును” చూసి సదరు హీరో ఇప్పుడు దూరం జరుగుతున్నాడట. ఇక లాభం లేదనుకొని ఇలియానా తనకు తెలిసిన నిర్మాతలతో అవకాశాల కోసం సంప్రదింపులు జరుపుతోందట. అయితే అవేవీ ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపించడం లేదు. తెలుగు చిత్ర సీమలో నాలుగేళ్లుగా నెంబర్ వన్ స్థానంలో ఉన్నప్పుడు ఒక్కో సినిమాకు కోటి దాకా పారితోషకం తీసుకున్నదని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఆ డబ్బులతోనే గోవా పరిసర ప్రాంతాల్లో భారీగా భూములు కొన్నదని, ఇప్పుడు వాటి విలువ పెరగడంతో అమాంతం ఆగర్భ శ్రీమంతురాలు అయిందని సమాచారం. ఆండ్రూ తో ప్రేమలో ఉన్నప్పుడు ఇలియానాకు మరో లోకం ఉండేది కాదు. ఇద్దరు చెట్టా పట్టాలు వేసుకుని తిరిగేవారు.

సోషల్ మీడియాలో కూడా ఫోటోలను షేర్ చేసేవారు. కానీ ఇప్పుడైతే ఇద్దరి మధ్య వ్యవహారం బెడిసి కొట్టిందో.. అప్పుడే ఇలియానాకు తత్వం బోధపడింది. అసలు ప్రేమంటేనే ఒక ట్రాష్ అని ఇలియానా అసహనం వ్యక్తం చేసింది. కానీ కొద్ది రోజుల గ్యాప్ తర్వాత ఆమెకు సంబంధించిన ప్రేమ కథలు ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చాయి. సరే ఈ ప్రేమ కథల సంగతి తర్వాత.. ఇలియానా ఇప్పుడు ఏం సినిమాలు చేస్తోందబ్బా?.. అంటే ప్రస్తుతానికైతే ఆమె చేతిలో సినిమాలేవి ఉన్నట్టు లేవు. సినిమాలు లేకపోయినా ఇలియానాకి బాలీవుడ్ లో పరిచయాలు చాలా చాలా ఎక్కువ. పుట్టిందే గోవాలో కాబట్టి.. స్వతహాగా ఇలియానా పార్టీ యానిమల్. పైగా ఈమెకు ఫ్రెండ్స్ కూడా ఎక్కువే. వెరసి ఇల్లీ బేబీ అలియాస్ ఇలియానా ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు ఇప్పుడు. ప్రేమను ఒక ట్రాష్ గా అభివర్ణించిన ఇలియానా.. శృంగారాన్ని మాత్రం ఒక అనుభూతిగా చెప్పడం అర్థం చేసుకున్నవాళ్లకు అర్థం చేసుకున్నంత! యమలీల సినిమాలో.. నాకు ఒక బుల్లి చెల్లి.. నేడే గల్లీలో పెళ్లి. జరగాలి మళ్ళీ మళ్ళీ అని తనికెళ్ల భరణి అంటాడు. సీరియస్ విలన్ గానే కామెడీ పండిస్తాడు. ఇప్పుడు రోజులు మారాయి. బాయ్ ఫ్రెండ్స్ మార్చేయకపోతే జీవితం బోర్ గా ఉంటుందనే భావనలో ఉన్నారు సినిమా హీరోయిన్లు. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. హీరోలేనా వాడుకొని వదిలేసేది.. మాకేం తక్కువ అంటూ కొంత మంది హీరోయిన్లు కూడా అదే బాటను అనుసరిస్తున్నారు. ఇందుకు ఇలియానా మినహాయింపు కాదు.