Sunrisers Team Pushpa Dialogues: తెలుగునాట క్రికెట్ కు, సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగు అభిమానులు తమకు నచ్చిన క్రికెటర్ ను అయినా లేదంటే తమకు నచ్చిన హీరోను అయినా తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తుంటారు. తమకు నచ్చిన హీరో సినిమా వచ్చిందంటే చాలు చొక్కాలు చించుకున్నా సరే సినిమా టికెట్లు సాధిస్తారు. తొలి రోజు ఆ సినిమా చూసేందుకు అంతలా ఇష్టపడతారు. ఇటు క్రికెట్ విషయంలోనూ అంతే. తమ ఫేవరెట్ ప్లేయర్ ఆట చూసేందుకు వేలకు వేలు ఖర్చు పెట్టి మరి గ్రౌండ్ కి వెళ్తారు.

ఇక సన్ రైజర్స్ జట్టుకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ లో ఈ జట్టుకు రెండు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ ఉంది. ఈ టీమ్ కు ఆడిన ప్రతి వారిని తెలుగు ప్రజలు ఓన్ చేసుకుంటారు. అందుకే డేవిడ్ వార్నర్ ను డేవిడ్ బాయ్ గా, విలియంసన్ ను కేన్ మామగా అభివర్ణిస్తుంటారు తెలుగు ప్రజలు. అయితే ఈ మధ్య క్రికెటర్లతో హీరోల డైలాగులు చెప్పించడం, సాంగ్స్ కు స్టెప్పులు వేయించి మరీ హైప్ తీసుకువస్తున్నాయి టీం మేనేజ్ మెంట్ లు.

Also Read: చివరివరకూ పోరాడిన భారత షట్లర్.. భారత బ్యాడ్మింటన్ భవిష్యత్ ఇతడే?
ప్రస్తుతం 15 ఐపీఎల్ సీజన్ కు సిద్ధమవుతున్న సన్ రైజర్స్.. సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తోంది. అయితే సన్ రైజర్స్ టీం మేనేజ్ మెంట్.. క్రికెటర్లతో సినిమా డైలాగులు చెప్పించి తెలుగు ప్రజలకు దగ్గర కావాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మొన్న ఓపెనర్ అభిషేక్ శర్మ కళావతి సాంగుకు స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆటకు ముందు ప్రీ షూట్ లో పాల్గొన్న టీం.. కేవలం ఫోటోలకు ఫోజులు ఇస్తే ఏం వస్తుంది అనుకుందో ఏమో.. దేశవ్యాప్తంగా మేనియా చూపించిన పుష్పరాజ్ డైలాగుతో క్రికెటర్లు దుమ్ము లేపారు. క్రికెటర్లు వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ తగ్గేదే లే డైలాగుతో అదరగొట్టేసారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సన్ రైజర్స్ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Also Read: ఆ బ్రాండ్స్ తెచ్చింది చంద్రబాబే.. కౌంటర్లు వేస్తున్న వైసీపీ..
Recommended Video:
[…] […]
[…] […]
[…] Ilaiyaraaja: మాస్ట్రో ఇళయరాజా అంటేనే సంగీత ప్రపంచంలో తిరుగులేని మేటి. ఎందుకంటే.. ఆయన సంగీతంలో ఒక ఉత్తేజం ఉంటుంది. ఆయన స్వరంలో ఒక ‘ఉత్సాహాం ఉంటుంది. అన్నిటికి మించి ఇళయరాజా ఎప్పుడు సీరియస్ గా ఉంటారు. ఆయన మధురమైన ప్రేమ పాటలను సృష్టిస్తాడు గానీ, ఆయన జీవితంలో ప్రేమ లేదు అని ఇన్నాళ్లు ఒక ప్రచారం జరిగింది. […]